
త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు మూడవ సీజన్ కంటెస్టెంట్‌లు ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాము బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా యాంకర్ లాస్య కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
‘మీకో విషయం తెలుసా.. నేను బిగ్ బాస్‌కు వచ్చేస్తున్నాను. బిగ్‌బాస్‌లో లాస్య కన్ఫార్మ్ అయిపోయింది. లాస్యకు బిగ్‌బాస్ వాళ్లు షో స్టార్ట్ కాకముందే 30 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్ధం. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్’ అని లాస్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తను బిగ్‌బాస్‌లోకి రావడం లేదని చెప్పిన లాస్య.. ఈ వార్తలు చూసి తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నట్టు వెల్లడించారు. అది ఫేక్ న్యూస్ అని చెప్పడానికే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. తనకు చిన్నబాబు ఉన్నాడని.. బాబుతోనే టైమ్ సరిపోతుందని.. ఈ టైమ్ మళ్లీ మళ్లీ రాదని అన్నారు. ఈ ఒక్క ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని అనుకుంటున్నట్టు తెలిపిన లాస్య.. ఏదైనా ఉంటే నెక్ట్స్ టైమ్ చూద్దామని పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేస్ న్యూస్ సంబంధించిన ఫొటోను లాస్య ఇన్‌స్టాలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment