participation
-
మిస్ యూనివర్స్ పోటీలు.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
రియాద్: ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంలచన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు దేశం తరపున 27 ఏళ్ల సుందరి రుమీ అల్కతానీని నామినేట్ చేశారు. ఈ విషయాన్ని రుమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం ఇది తొలిసారని ఆమె తన పోస్టులో పేర్కొంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన రుమీ ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటం గెలుచుకోవడం విశేషం. దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హాయంలో ఈ తరహా చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవల ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇస్లామిక్ దేశం తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి.. అమెరికాలో కూలిన బ్రిడ్జ్.. ప్రమాదమా.. ఉగ్రవాదమా..? -
పుతిన్ షాకింగ్ నిర్ణయం! యూఎస్‌కి ఊహించని ఝలక్
ఉక్రెయిన్‌పై దాడికి దిగి ఏడాది కావోస్తున్న సందర్భంగా పుతిన్ పార్లమెంట్లో రష్యాను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ ప్రసంగం ముగిసే సమయంలో చట్ట సభ్యులతో ఒక షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. రష్యా ప్రమాదకర వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో యూఎస్‌తో తన భాగస్వామ్యాన్ని నిలిపేస్తేన్నట్లు ప్రకటించారు. ఇరుపక్షాల వ్యూహాత్మక అణ్వాయుధాలను పరిమితం చేసే న్యూ స్టార్ట్ ట్రిటీ(New START treaty) ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యన్ని నిలిపేస్తుందని పుతిన్ వెల్లడించారు. వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్ ట్రిటీ ఒప్పందంపై 2010లో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఏడాదే ఇది అమల్లులోకి వచ్చింది. మళ్లీ 2021లో జో బైడెన్ పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఒప్పందం మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఇది అమెరికా రష్యా వ్యూహాత్మక అణు వార్హెడ్లను సంఖ్యను పరిమితం చేసేలా, భూమి, జలాంతర్గామీ ఆధారిత క్షిపణులు, బాంబులను మరింతగా విస్తరింప చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..రష్యా వద్ద దాదాపు 6 వేల వార్హెడ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాల నిల్వ ఉన్నట్లు సమాచారం. అంతేగాదు రష్యా, అమెరికాలే వద్ద ప్రపంచంలోని 90% అణు వార్హెడ్లను కలిగి ఉన్నాయని, ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయగలవని చెబుతున్నారు. (చదవండి: యుద్ధాన్ని ప్రారంభించింది పశ్చిమ దేశాలే: పుతిన్ సంచలన వ్యాఖ్యలు) -
Kalpana Ramesh: జల కల్పనకు ఊతం!
‘‘75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని బన్సిలాల్‌పేట్ మెట్లబావిని పునరుద్ధరించేందుకు 75 మందికి పైగా స్థానిక జనం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది’’ అంటూ ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్న కల్పనా రమేష్ ఆనందంగా వివరించారు. హైదరాబాద్‌లో పాడుబడిన బావులను పునరుద్ధరిస్తూ, చెరువులు–కుంటలను సంరక్షిస్తూ, వాన నీటితో భూగర్భజలాలను పెంచడానికి కృషి చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒంగోలులో పుట్టి పెరిగిన కల్పన వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ స్టూడియో కూడా నిర్విహిస్తున్న కల్పనా రమేష్ నీటి వైపుగా వేసిన అడుగుల గురించి వివరించారు. ‘‘ఐదేళ్ల క్రితం కుటుంబంతో అమెరికా నుండి భారత్‌కు వచ్చాను. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు చుట్టూ పచ్చదనం కావాలనుకున్నాను. కానీ, అప్పటికి ట్యాంకర్లతోనే నీటిని తెప్పించుకునే పరిస్థితి. ఆ నీళ్లలో హానికారకాలున్నాయని గుర్తించాను. ఈ పరిస్థితి ని ఎలాగైనా మార్చాలనుకున్నాను. మా డాబా మీద వర్షపు నీటిని నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నాను. వాడిన నీళ్లు వృథాపోకుండా రీఛార్జ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిని అనుసరించాను. ఏడాదిలోనే మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం చల్లదనం, పచ్చదనం తో ఆహ్లాదకరంగా మారిపోయింది. బడి పిల్లలకు అవగాహన తరగతులు ఎప్పుడైతే ఈ ఆనందం మేం చవి చూస్తున్నామో, నాటి నుంచి మా కాలనీవాసులూ ఇదే పద్ధతిని అనుసరించారు. దీంతో సమాజానికి నా వంతు సాయం చేయాలని, వాటర్ రీసైక్లింగ్ పై జనాల్లో అవగాహన పెంచుతూ వస్తున్నాను. ఇందుకు స్కూళ్లు, కాలేజీల్లోనూ దాదాపు 70 వేల మంది పిల్లలకు అవగాహన క్లాసులు తీసుకున్నాను. పాఠశాలల నుంచి పిల్లలే స్వచ్ఛందంగా ఈ నీటి యజ్ఞంలో పాల్గొనేలా చేశాను. చెరువుల సంరక్షణ నగరంలో రియల్ ఎస్టేట్ కారణంగా వందల చెరువులు కాంక్రీట్ వనంలో కలిసిపోయాయి. ఇంకొన్ని ఇరుకైపోయాయి. కొన్ని మురుగు కు కేంద్రాలయ్యాయి. గోపీనగర్ చెరువు ఇందుకు ఉదాహరణ. దీనికోసం స్త్రీలనే బృందాలుగా ఏర్పాటు చేయడంతో, వారంతా చెరువు చెత్తను ఆటోల్లో డంప్‌యార్డ్ కు తరలించడం మొదలుపెట్టారు. పది రోజుల్లోనే ఆ చెరువును పరిశుభ్రంగా మార్చేశారు. పాత బావులను తిరిగి వాడుకునేలా.. గచ్చిబౌలిలో మసీద్ వద్ద ఉన్న పాత బావి కొన్నేళ్లుగా చెత్తకు డంప్‌యార్డ్‌గా మారింది. పూర్తిగా చెత్త తొలగించి, ఆ చుట్టుపక్కల ఇళ్ల రూఫ్ నుంచి వర్షపు నీళ్లు బావిలో పడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు మసీదుకు వచ్చేవారు కూడా బావి నీళ్లు వాడుతున్నామని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాగే.. కోకాపేట్, కొండాపూర్, గచ్చిబౌలి, బన్సీలాల్‌పేట్.. ప్రాంతాల్లోని ప్రాచీన బావులను వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేశాం. ఇంకుడు గుంతలు, పాత బావులు... ఇతరత్రా విధానాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే నీటి ఎద్దడి రాదు. అంతా ప్రభుత్వమే చేయాలనుకోకుండా ఎవరికి వారు ఈ పనులు చేపడితే ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ ప్రజల్లో ఉండే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో, దానిని ఎలా దూరం చేయాలో ఒక ఉదాహరణ కుడికుంట చెరువు. ఆ చెరువును బాగు చేయడానికి ముందు స్థానికులతో చర్చించాను. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ కావాలని కోరాను. అందరం కలిసి చెరువు నుంచి వంద టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. చెరువులను, బావులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు దీని వల్ల నాకేదో ప్రయోజనం ఉందన్నారు కొందరు. అపుడు బాధేసింది. కానీ నా భర్త రమేష్ ఇచ్చిన సలహాలు, మద్దతు నన్ను బలవంతురాలిని చేశాయి. అలా ‘లివ్ ది లేక్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించా. నీరు మనిషి ప్రాథమిక హక్కు. నీటి నిల్వపై అవగాహనతో పాటు అపార్ట్మెంట్స్, ఆఫీసులకు అండగా నిలుస్తున్నా. పాడైన బోర్లను బాగు చేసేందుకు 10కె బోర్స్ కార్యక్రమాన్ని చేపట్టా. ఇంటి ఆవరణలోనే రీ చార్జ్ పిట్లు ఏర్పాటు చేస్తున్నాను. జీహెచ్ఎంసీ, కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాను. నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సిటీ లేక్ యాక్షన్ కమిటీ టు కన్సర్వ్ లేక్స్’లో ఉన్నాను’ అని వివరించారు ఈ వాటర్ వారియర్. కల్పన జల సంరక్షణ మంత్రం ‘రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్.’ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపుతున్నారు. మొదటి అడుగు ఒంటరిదే అయినా సంకల్పం బలంగా ఉంటే వేల అడుగులు జతకలుస్తాయి అంటున్న కల్పనారమేష్ అందుకు అసలైన ఉదాహరణ. ఇది వర్షాకాలం. నీటి నిల్వలు పెంచుకోవడానికి సరైన కాలం అంటున్నారు కల్పన. -
Zomato: జొమాటో కీలక నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ భాగస్వాములుగా పెద్ద ఎత్తున మహిళలను చేర్చుకోనుంది. ప్రస్తుతం డెలివరీ పార్ట్నర్స్లో మహిళల వాటా 0.5 శాతం. తొలి అడుగులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 10 శాతానికి చేర్చనున్నట్టు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, హైదరాబాద్, పుణేలో వీరి నియామకాలు ఉంటాయని తెలిపారు. అయితే డెలివరీ భాగస్వాములుగా మహిళలను చేర్చుకోవడం లక్ష్యం నిర్ధేశించుకున్నంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. ‘మహిళలను ఈ రంగం ఆకర్శించడానికి, అలాగే వారు కొనసాగడానికి విధానాలు మారాలి. ఆత్మ రక్షణ కోసం తప్పనిసరిగా వారికి శిక్షణ ఇస్తున్నాం. మహిళల కోసం 24 గంటలూ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపత్కాలంలో లైవ్ లొకేషన్ క్షేత్ర స్థాయి సిబ్బందికి, కేంద్ర కార్యాలయానికి, సమీపంలో ఉన్న డెలివరీ భాగస్వాములకు వెంటనే చేరుతుంది’ అని వెల్లడించారు. వీరికి కనీస వసతులు కల్పించేందుకు రెస్టారెంట్స్ సైతం ముందుకు వచ్చాయని తెలిపారు. ప్రజలు సమీప భవిష్యత్తులో డెలివరీ బాయ్స్‌గా కాకుండా డెలివరీ భాగస్వాములుగా పరిగణిస్తారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. పనిచేయడానికి అనువైన ప్రదేశంగా జొమాటోను తీర్చిదిద్దేందుకు భాగస్వాముల సూచనలను అమలు చేస్తున్నామన్నారు. -
G7 Summit: ఉపేక్షించలేని శక్తిగా భారత్
స్వాతంత్య్రానంతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాశ్చాత్య ప్రపంచంతో భారత్ ఇప్పుడు చాలా సరళమైన సంబంధాలను నెరుపుతోంది. ఇప్పుడు భారత విదేశాంగ విధానం కనీవినీ ఎరుగని క్రియాశీలతతో వ్యవహరిస్తుండటం విశేషం. ఒక బలమైన దేశంగా భారత్ పురోగమన గాథకు ఇది అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సుకు భారత్ హాజరుకావడం అనేది దేశ వారసత్వ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా భారత్‌ను ఇక ఎవ్వరూ తక్కువ చేసి చూడలేరని ఈ సదస్సులో భారత్ భాగస్వామ్యం తేల్చి చెబుతోంది. శుక్రవారం బ్రిటన్‌లో ప్రారంభమైన జీ–7 దేశాల కూటమి సదస్సు ప్రపంచానికి కొత్త ఆశల్ని కల్పిస్తోంది. గత ఏడాది, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ–7 దేశాల కూటమిని కాలం చెల్లిన బృందంగా తోసిపుచ్చారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలతో కూడిన జీ–7 కూటమి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సరిగా ప్రాతినిధ్యం వహించనందున అదొక కాలం చెల్లిన గ్రూప్‌గా ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఈ సంవత్సరం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన దౌత్య విస్తరణకు ప్రారంభ వేదికగా జీ–7 దేశాల కూటమిని ఉపయోగించుకుని ప్రపంచ రాజకీయాలపై తనదైన ముద్రను వేయడానికి ప్రయత్నించండం మరొక భిన్నమైన కథ అనుకోండి. అమెరికా తిరిగి ముందుపీఠికి వస్తోందనీ, మన భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన అంశాలు, కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా ముందుకొస్తున్నాయని పేర్కొనడం ద్వారా బైడెన్ తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజ యవంతంగా ముగించాలని భావిస్తున్నారు. బ్రిటన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గతంలో ట్రంప్ కల్లోల పాలన, బ్రెగ్జిట్ సర్దుబాటు అనంతరం ఇరుదేశాల సంబంధాలను పునరుజ్జీవింప చేసే లక్ష్యంతో ముందుకు సాగవచ్చు. తమ రెండు దేశాల ప్రత్యేక బాంధవ్యం భావనను మరోసారి ముందుకు తీసుకురావడం ద్వారా అట్లాం టిక్ ఒడంబడిక తాజా వెర్షన్‌పై జో, బోరిస్ సంతకం చేశారు. అంతే కాకుండా, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, సామూహిక భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, న్యాయబద్ధమైన, నిలకడైన ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నిర్మించడానికి తగు చర్చలు తీసుకుంటామని ఇరు దేశాల నేతలు ప్రతిజ్ఞ చేశారు. అయితే ఐరిష్ సముద్రం పొడవునా సాగుతున్న వాణిజ్యంపై ఇరుదేశాల మధ్య స్వల్ప భేదాలు ఉంటున్నాయి. గుడ్‌ఫ్రైడే ఒడంబడిక ద్వారా ఇరుదేశాలూ రూపొందించుకున్న స్థిరత్వాన్ని దెబ్బతీసేలా నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్‌ను వాషింగ్టన్ ఉల్లంఘిస్తుండటంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయి. తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో బైడెన్ ముఖ్యమైన ఎజెండాలను పెట్టుకున్నారు. విండ్సార్ కాజిల్‌లో బ్రిటన్ రాణితో సమావేశం, జీ–7 దేశాల సమావేశానికి హాజరవడం, అమెరికా అధ్యక్షుడిగా తొలి నాటో సదస్సులో పాల్గొనడం, తర్వాత జెనీవాలో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావడం.. ఇలా బైడెన్ విదేశీ పర్యటన తీరిక లేని కార్యక్రమాలతో సాగనుంది. చివరిదైన పుతిన్‌తో సమావేశం అత్యంత స్పర్థాత్మకం కావచ్చు కాబట్టే యావత్ ప్రపంచం వీరిరువురి భేటీ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. బ్రిటన్ అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైన జీ–7 దేశాల సదస్సు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించింది. భవిష్యత్తులో మహమ్మారులపై పోరాటానికి ముందే సన్నద్ధమవుతూ, ప్రస్తుత కరోనా వైరస్ ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని బయటపడేయడం; స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యానికి తలుపులు తెరవడం ద్వారా భవిష్య సమాజ సౌభాగ్యానికి ప్రోత్సాహమివ్వడం; పర్యావరణ మార్పును ఎదుర్కొని, భూగ్రహం జీవవైవిధ్యతను పరిరక్షించడం; స్వేచ్చాయుత సమాజాలు, వాటి ఉమ్మడి విలువలను ఎత్తిపట్టడం వీటిలో కొన్ని. వీటిలో కోవిడ్–19 మహమ్మారి నుంచి బయటపడటమే కీలకం. ఇదే ఇప్పుడు యావత్ ప్రపంచానికి కేంద్ర బిందువు. బ్రిటన్‌లో ప్రస్తుత జీ–7 దేశాల సదస్సు మహమ్మారిని ఎదుర్కోవడంపై నూతన ప్రపంచ ఒడంబడికను రూపొందిస్తుందని, తద్వారా మన ప్రపంచం ఇక ఎన్నడూ ఇలాంటి మహమ్మారుల బారిన పడకుండా బయటపడు తుందని బోరిస్ జాన్సన్ దృఢనమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో, యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ నిరోధక వ్యాక్సినేషన్ విషయంలో ఘనమైన అంతర్జాతీయ సమన్వయానికి జీ–7 దేశాల కూటమి పిలుపునిస్తుందని భావిస్తున్నారు. కోవిడ్–19పై పోరుకోసం యావత్ ప్రపంచానికి టీకాలు అందించడమే అమెరికా ప్రాధాన్యతల్లో ఒకటిగా పేర్కొన్న బైడెన్ యంత్రాంగం, ప్రపంచంలోని 90 నిరుపేద దేశాలకు తన వంతుగా వ్యాక్సిన్ డోస్‌లను విరాళంగా అందిస్తానని ఇప్పటికే ప్రకటించింది. ఇది ఎంతగానో స్వాగతించవలసిన అంశం కానీ వచ్చే ఏడాది ప్రారంభానికి అంతర్జాతీ యంగా 180 కోట్ల కరోనా టీకాలను అందించడంలో ఇతర ప్రపంచ శక్తులు కూడా తమవంతుగా గరిష్ట సహాయం ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా జీ–7 దేశాల కూటమి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కలయికగా ఉంటున్నందున ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, నిలకడతో కూడిన అభివృద్ధి వంటి ఉమ్మడి విలువల పరిరక్షణకోసం కట్టుబడి ఉంటున్నాయి. అగ్రదేశాలమధ్య భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జీ–7 దేశాల కూటమి ఉద్దేశాన్ని పునర్నిర్వచించడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుత జీ–7 కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా రిపబ్లిక్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ను కూడా బ్రిటన్ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావ సారూప్యం కలిగిన దేశాలను కలిపి ఉంచే ప్రయత్నంలో భాగంగా వీటిని జీ–7 సదస్సుకు అతిథ్య దేశాలుగా ఆహ్వానించారు. ఇది ప్రపంచ పరిపాలనను మరింత సమర్థతతో నిర్వహించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. చైనా ద్వారా ఎదురవుతున్న భౌగోళిక రాజ కీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ప్రభావాన్ని మరింతగా విస్తరించుకోవలసిన అవసరం ఉందని పారి శ్రామిక సంపన్న దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ మొత్తం క్రమంలో భారత్ ఒక కీలకమైన భాగస్వామిగా ఆవిర్భవించింది. 2014 నుంచి జీ–7 దేశాల సదస్సులో పాలుపంచుకోవడం ప్రధాని నరేంద్రమోదీకి ఇది రెండోసారి. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ సైతం మోదీని ఆహ్వానించాలనుకున్నారు కానీ అమెరికాలో మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు. ఈ ఏడాది మోదీ నేరుగా ఈ సదస్సుకు హాజరు కావలసినప్పటికీ, భారత్‌లో మహమ్మారి తీవ్రత దృష్ట్యా సదస్సు సమావేశాల్లో ఈయన వర్చువల్‌గా మాత్రమే పాలుపంచుకోవలసి ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా జీ–7 దేశాలతో భారత్ నిలకడైన సంబంధాలను సాగిస్తున్నందువల్ల, పశ్చిమదేశాలతో భారత్ బాంధవ్యం మరొక మెట్టు పైకి ఎదగనుంది. అంతర్జాతీయ పాలనలో తన వంతు పాత్రను పోషించాలని, తన సమర్థతలను మరింతగా విస్తరించాలని భారత్ ఆశిస్తున్నందున పారిశ్రామిక సంపన్న దేశాలతో బలమైన భాగస్వామ్యాలకోసం ప్రయత్నిస్తోంది. స్వాతంత్య్ర భారత చరిత్రలో మునుపెన్నడూ లేనివిదంగా పాశ్చాత్య ప్రపంచంతో భారత్ ఇప్పుడు చాలా సరళమైన సంబంధాలను నెరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ భాగస్వాములతో కలిసి పనిచేయడం నుంచి, పాశ్చాత్యదేశాలతో మంచి సబంధాలను ఏర్పర్చుకోవడం వరకు ఇప్పుడు భారత విదేశాంగ విధానం కనీవినీ ఎరుగని క్రియాశీలతతో వ్యవహరిస్తుండటం విశేషం. భారత్ దేశీయంగా ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఉత్తాన పతనాలను చవిచూస్తున్నప్పటికీ ఒక బలమైన దేశంగా భారత్ పురోగమన గాథకు ఇది అద్దం పడుతోంది. తక్కిన ప్రపంచంలో భారత్ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నందున ప్రపంచం కూడా భారత్‌తో మంచి సంబంధాలను ఏర్పర్చుకోగలుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సుకు భారత్ హాజరుకావడం అనేది దేశ వారసత్వ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా భారత్‌ను ఇక ఎవ్వరూ కించపర్చలేరని, తక్కువ చేసి చూడలేరని ఈ సదస్సులో భారత్ భాగస్వామ్యం తేల్చి చెబుతోంది. హర్ష్ వి. పంత్ వ్యాసకర్త ప్రొఫెసర్, డైరెక్టర్, అబ్జర్వేషన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఢిల్లీ -
పీబీఎల్‌కు శ్రీకాంత్ దూరం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జరిగే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో పాల్గొనడం లేదని భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ ప్రకటించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌పై, ఇతర అంతర్జాతీయ టోర్నీల మీద మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నాడు. -
బిగ్‌బాస్ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..
త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు మూడవ సీజన్ కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాము బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా యాంకర్ లాస్య కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘మీకో విషయం తెలుసా.. నేను బిగ్ బాస్‌కు వచ్చేస్తున్నాను. బిగ్‌బాస్‌లో లాస్య కన్ఫార్మ్ అయిపోయింది. లాస్యకు బిగ్‌బాస్ వాళ్లు షో స్టార్ట్ కాకముందే 30 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్ధం. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్’ అని లాస్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తను బిగ్‌బాస్‌లోకి రావడం లేదని చెప్పిన లాస్య.. ఈ వార్తలు చూసి తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నట్టు వెల్లడించారు. అది ఫేక్ న్యూస్ అని చెప్పడానికే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. తనకు చిన్నబాబు ఉన్నాడని.. బాబుతోనే టైమ్ సరిపోతుందని.. ఈ టైమ్ మళ్లీ మళ్లీ రాదని అన్నారు. ఈ ఒక్క ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని అనుకుంటున్నట్టు తెలిపిన లాస్య.. ఏదైనా ఉంటే నెక్ట్స్ టైమ్ చూద్దామని పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేస్ న్యూస్ సంబంధించిన ఫొటోను లాస్య ఇన్‌స్టాలో ఉంచారు. -
బిగ్‌బాస్‌పై లాస్య ఏమన్నారంటే..
-
బిగ్‌బాస్-3లో నేను లేను.. క్లారిటీ ఇచ్చిన నటి
హైదరాబాద్ : ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు షో త్వరలోనే మూడవ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌లో ఫలానా వారు పార్టిసిపెంట్ చేస్తున్నారంటూ రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా యువ కథానాయిక శోభిత ధూళిపాళ్ల బిగ్‌బాస్ మూడో సీజన్లో ఒక పార్టిసిపెంట్‌గా వస్తున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై శోభిత ధూళిపాళ్ల 'బిగ్‌బాస్ లో నేను పాల్గొంటున్నానన్నది రూమరే. మీ పట్లిసిటీ కోసం నా పేరును వాడుకోవద్దని' ట్విటర్లో ఘాటుగానే స్పందించారు. శోభిత ధూళిపాళ్ల ఇటీవలే అడవి శేష్ హీరోగా రూపొందిన గూఢచారి సినిమాలో కథానాయికగా నటించి, మంచి పేరు సంపాదించుకుంది. అధికారికంగా వెల్లడికాకపోయిన తెలుగు బిగ్‌బాస్-3 షోలో గుత్తాజ్వాల, సింగర్ హేమచంద్ర అడుగుపెడతారని వచ్చిన రూమర్లపై వారే స్వయంగా తాము పాల్గొనడం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బిగ్‌బాస్-3 తెలుగు షోకు సినీ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. -
వీరి సేవను గుర్తుచేసుకుందామా?
భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళలు పురుషులతో సమానంగా సేవలందించారు. భరతమాత కోసం వాళ్లు చేసిన సాహసాలలో కొన్నింటిని గుర్తు చేసుకుందాం. 1. బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహిళ ఝాన్సీలక్ష్మీబాయ్, తర్వాత తరం పోరాటయోధులకు ఆమె స్ఫూర్తి. ఎ. అవును బి. కాదు 2. సరోజినీనాయుడు ఇంగ్లండ్ వెళ్లి, అక్కడి సమావేశంలో బ్రిటిష్ విధానాలను బాహాటంగా విమర్శించారు. ఎ. అవును బి. కాదు 3. బ్రిటిష్ ప్రభుత్వం సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడంతో అరుణా అసఫ్ అలీ కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎ. అవును బి. కాదు 4. ఇందిరాగాంధీ స్వాతంత్య్ర సమరంలో నాయకులకు సహాయం అందించడం కోసం తోటి పిల్లలతో ‘వానరసేన’ అనే బృందాన్ని తయారు చేశారు. ఎ. అవును బి. కాదు 5. కమలానెహ్రూ మద్యానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారని మీరు చదివారు. ఎ. అవును బి. కాదు 6. మేడమ్ సామా మన జెండాని జర్మనీలో ఎగురవేశారు. ఎ. అవును బి. కాదు 7. మొదటి స్వాతంత్య్ర పోరాటం సమయంలో బేగమ్ హజ్రత్ మహల్ – బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహించినట్లు మీకు తెలుసు. ఆమె గౌరవార్థం ఇండియా 1984లో స్టాంపును విడుదల చేసింది. ఎ. అవును బి. కాదు 8. విదేశీయురాలైన అనిబిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ. ఎ. అవును బి. కాదు 9. కస్తూర్బా స్వాతంత్రోద్యమంలో గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే తన ఉద్యమం అన్నట్లుగా పనిచేశారనీ, గాంధీజీ జైలుపాలైనప్పుడు ఉద్యమాలను తానే స్వయంగా నడిపించారని తెలుసు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే స్వాతంత్రోద్యమం పైనా, అందులో మహిళల భాగస్వామ్యం పైనా మీకు తగినంత పరిజ్ఞానం ఉంది. -
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి
కోదాడఅర్బన్: ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మకతను పెంచకుని నూతన ఆవిష్కరణలు చేస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కాకినాడ జెఎన్టీయూ ప్రొఫెసర్ కెవీ మరళీకృష్ణ కోరారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా గురువారం పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాసంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు చేసే ప్రతిపనిలో స్పష్టత కలిగి ఉండాలన్నారు. కొత్త ఆలోచనలు, నిరంతర ప్రయత్నాలతో విద్యార్థులు ఇంజనీర్లుగా రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలైన వారికి ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ నాగార్జునరావు, ఎఓ కృష్ణారావు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా భాగస్వామ్యంతోనే గ్రీనరీ
సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో రామ్ మోహన్‌రావు గుంటూరు వెస్ట్ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం ద్వారానే గ్రీనరీ సాధ్యమని సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో పి.రామ్ మోహన్‌రావు తెలిపారు. 2016లో అటవీశాఖ జిల్లాలో కోటీ 7 లక్షల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమ వివరాలను ఆయన వివరించారు. జిల్లాలో విస్తీర్ణంలో 14.58 శాతం అడవులు ఉన్నట్లు తెలిపారు. అటవీ విస్తీర్ణం పెంచే కార్యక్రమంలో భాగంగా 29వ తేదీన జిల్లావ్యాప్తంగా 11 లక్షల 31 వేలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నల్లపాడులోని నగరవనంలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. మొక్కలను పెంచాలని ఆసక్తి కలిగినవారు 1800 425 3252 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని, అవసరమైన మొక్కలను తీసుకుని వెళ్లవచ్చని ఆయన సూచించారు. -
హరితహారంలో పాల్గొన్న మంత్రులు
చిట్యాల : పట్టణంలోని గ్రామపంచాయతీ ఆవరణ, గ్రంథాలయం వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం వారు మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీపీ భట్టు అరుణ, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ బెల్లి సత్తయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఏనుగు నర్సింహారెడ్డి, గుండెబోయిన సైదులు పాల్గొన్నారు. -
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న కవిత
-
స్వచ్ఛభారత్‌లో పోలీసులు