
హరితహారంలో పాల్గొన్న మంత్రులు
చిట్యాల : పట్టణంలోని గ్రామపంచాయతీ ఆవరణ, గ్రంథాలయం వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం వారు మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీపీ భట్టు అరుణ, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ బెల్లి సత్తయ్య, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఏనుగు నర్సింహారెడ్డి, గుండెబోయిన సైదులు పాల్గొన్నారు.