రియాద్: ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంలచన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు దేశం తరపున 27 ఏళ్ల సుందరి రుమీ అల్‌కతానీని నామినేట్ చేశారు.
ఈ విషయాన్ని రుమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం ఇది తొలిసారని ఆమె తన పోస్టులో పేర్కొంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన రుమీ ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటం గెలుచుకోవడం విశేషం. దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హాయంలో ఈ తరహా చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవల ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇస్లామిక్ దేశం తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి.. అమెరికాలో కూలిన బ్రిడ్జ్.. ప్రమాదమా.. ఉగ్రవాదమా..?
Comments
Please login to add a commentAdd a comment