దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి | must need participation in developing country | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి

Published Thu, Sep 15 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి

దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి

కోదాడఅర్బన్‌: ఇంజనీరింగ్‌ విద్యార్థులు సృజనాత్మకతను పెంచకుని నూతన ఆవిష్కరణలు చేస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కాకినాడ జెఎన్‌టీయూ ప్రొఫెసర్‌ కెవీ మరళీకృష్ణ కోరారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా గురువారం పట్టణంలోని కిట్స్‌ మహిళా ఇంజనీరింగ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాసంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులు చేసే ప్రతిపనిలో స్పష్టత కలిగి ఉండాలన్నారు. కొత్త ఆలోచనలు, నిరంతర ప్రయత్నాలతో విద్యార్థులు ఇంజనీర్లుగా రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలైన వారికి ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ నాగార్జునరావు, ఎఓ కృష్ణారావు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement