పోటీదారులు ఎంతమంది ఉన్నా విజేత ఒక్కరే. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ కోసం ఎనిమది మంది పోరాడుతున్నారు. అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్, మోనాల్, అరియానా, అవినాష్, లాస్య ఎవరికి వారే టైటిల్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు బలహీనతలను అధిగమించి, ఎమోషన్స్‌ను జయించి, బలాన్ని కూడదీసుకుని, టాస్కులను ఒంటిచేత్తో పూర్తి చేసి విజయాన్ని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. కానీ ఎంత కష్టపడ్డా వీరిలో ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాలే వరకు వెళ్తారు. అందులో ఒక్కరికే టైటిల్ సొంతమవుతుంది. అలా మరో మూడు వారాల్లో షోకు శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో ట్రోఫీని అందుకునే అవకాశం ఎవరికి పుష్కలంగా ఉందనే విషయాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంటు కౌశల్ మండా వెల్లడించాడు. కానీ హౌస్‌లో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని చెప్పుకొచ్చాడు. ఆయన ఇంకా ఏమేం అన్నాడో అతడి మాటల్లోనే..
సీక్రెట్ రూమ్ అట్టర్ ఫ్లాప్..
అభిజిత్.. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఫిజికల్‌గా స్ట్రాంగ్ కాకపోవచ్చు. కానీ అతడు చెప్పే ప్రతీదీ జనాలకు అర్థమయ్యేట్టు చెప్తాడు. మా సీజన్‌లో తనీష్‌కు ఆ అలవాటు ఉంది. ఇతడు కచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. సోహైల్.. మంచి ప్లేయర్. కోపమే అతడి బలం. అతడు కోపంలో మాట్లాడే మాటలు విని ఎంజాయ్ చేయొచ్చు. సోహైల్ కూడా పక్కా టాప్ 2లో ఉంటారు. అఖిల్.. మిగతావాళ్లతో పోలిస్తే బాగా ఆడతాడు. మొదట్లో మోనాల్‌తో ట్రాక్ నడిపాడు. కానీ సడన్‌గా ఆ రిలేషన్‌షిప్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. తర్వాత మళ్లీ గేమ్‌లోకి వచ్చాడు. అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడని అతనితో పాటు ఇంటిసభ్యులకు కూడా తెలుసు. అయితే ప్రతి సీజన్‌కు సీక్రెట్ రూమ్ వర్కవుట్ కాదు. పైగా అఖిల్ ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి టెంపర్ లూజ్ అయ్యాడు. అదే అతడికి మైనస్ అవుతోంది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్)
అవినాష్ కామెడీ తగ్గించేశాడు
అవినాష్.. కామెడీ చేస్తున్నాడు, గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చిల్లర కామెడీ అన్నప్పటి నుంచి కామెడీ తగ్గించేశాడు. ఎత్తుకు పై ఎత్తుకు వేసుకుంటూ వెళ్తే టాప్ 5లోకి వెళ్తాడు. అరియానా.. అగ్రెసివ్. ఒకసారి పీక్స్‌కు వెళుతుంది మళ్లీ డ్రాపవుట్ అవుతుంది. అదే పీక్‌నెస్ మెయింటెన్ చేస్తే బాగుంటుంది. ఇక అవినాష్, అరియానా మధ్య బంధం బలంగా ఉంది. హారిక.. ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడుతుంది. అందరితో ఓపెన్ అవ్వట్లేదు. క్యూట్ అండ్ బబ్లీనెస్‌తోనే ఉండిపోతోంది. కానీ అక్కడ సమయం మించిపోతోంది. అయినా సరే తర్వాత చేద్దాం, తర్వాత ఆడదాం అనుకుంటే కుదరదు. ఇప్పటి నుంచే ఆడాల్సిందే. (చదవండి: అరియానా నాకు కాంపిటీషనే కాదు: లాస్య)
లాస్య అసలు స్వరూపం చూపించాలి
లాస్య.. గేర్ లేని కారును నడుపుతున్నట్లుగా ఆమె ఆట ఉంది. మొదటి నుంచి కూల్‌గా వెళ్తోంది. అందరూ ఆమె నవ్వునే చూశారు, కానీ కోపాన్ని కూడా చూడాలనుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు అసలు స్వరూపాన్ని చూపింస్తుందని కోరుకుందాం. మోనాల్.. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతోంది. అఖిల్‌తో రిలేషన్ నుంచి బయటకు వచ్చి గేమ్ మీద దృష్టి పెడితే బాగా ఆడగలదు. భాష రాకపోవడం వల్ల చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్పలేకపోతోంది. ఎమోషనల్‌గా కాకుండా అగ్రెసివ్‌గా ఆడితే బాగుంటుందని కౌశల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్ : నీకు పడిపోతా అవినాష్.. అరియానా)
Comments
Please login to add a commentAdd a comment