బిగ్‌బాస్‌: ఈ వారం నామినేషన్‌లో ఏడుగురు | Bigg Boss 4 Telugu: 5 Contestants Nominated For 4th Week Elimination | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ఈ వారం ఎవరు ఇళ్లు వదిలి వెళ్లనున్నారు!

Published Mon, Sep 28 2020 11:10 PM | Last Updated on Tue, Sep 29 2020 9:28 PM

Bigg Boss 4 Telugu: 5 Contestants Nominated For 4th Week Elimination - Sakshi

రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ సీజన్ 4 మెల్లగా పుంజుకుంటుంది. బిగ్‌బాస్ ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు. ముఖ్యంగా షో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరు బాగానే పుల్లలు పెట్టుకుంటున్నారు. దాంతో ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఓ రకంలో అందరి నిజస్వరూపాలను టాస్క్‌లు బయటపడేలా చేస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కూడా ఒకరిపై ఒకరు చాలా సెటైర్లు వేసుకున్నారు. స్వాతి దీక్షిత్‌ మార్నింగ్‌ మస్తీతో ఇంటి సభ్యులను అలరించగా.. బిగ్‌బాస్‌లో ఈరోజు ఇంకేం జరిగిందంటే...(సై అంటే సై: లాస్య, నోయల్‌ మధ్య మాటల యుద్ధం)

ఉదయం కాగానే మాస్‌ మహారాజ్‌ రవితేజ ‘గొంగూరు తోట కాడా కాపు కాసా’ మాస్‌ పాటకు ఇంట్లోని సభ్యులంతా ఎనర్జిటిక్‌గా డాన్స్‌ చేశారు. ఆ తర్వాత మార్నింగ్‌ మస్తిలో స్వాతి ఇంటి సభ్యులకు నవరసాలను నేర్పించాల్సి ఉంటుంది. అయితే స్వాతి తన పార్ట్‌నర్‌గా అభిజిత్‌ను ఎంపిక చేసుకుంది. శృంగార రసంలో భాగంగా అభిజిత్‌ను లవ్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఏడుపులో స్వాతి కంటే ముందే మోనాల్‌ ఏడ్చేసింది. కోపం టాస్క్‌లో భాగంగా లాస్య, నోయల్‌ మధ్య గొడవ పడుతున్నట్లు నటించారు. నా గురించి వేరే వాళ్ల వద్ద ఎందుకు మాట్లాడినవ్‌ అని అనగా.. నాకు వెనకాల చెప్పే అవసరం లేదంటూ లాస్య గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. బీభత్సంలో అవినాష్‌పై గంగవ్వ అరిచింది.  (బిగ్‌బాస్‌: ఈ వారం ఎవరు మర్డర్‌‌ కానున్నారు?)

అక్కా , తమ్ముడిలా ఉన్నారు
అనంతరం అభిని సులభంగా నామినేట్‌ చేయోచ్చు అంటూ దివి, మోహబూబ్‌ చర్చించుకున్నారు. అలాగే అరియానా, అవినాష్‌ మధ్య చర్చ జరిగింది. అందరితో ఉన్నట్లు నాతో ఉండటం లేదని అరియానా అవినాష్‌పై అలిగింది. ఇంతకు ముందు వేరేలా ఉండేవాడివని, నాపై నీకు వేరే అభిప్రాయం ఉండేదని అవినాష్‌ను ఆటపట్టించింది. అవినాష్‌ వచ్చి మోనాల్‌కు దగ్గరయ్యేందుకు అమ్మ గుర్తొస్తుందని సరదాగా అంటుండగా మధ్యలో అఖిల్‌ కల్పించుకొని సేమ​ అక్కా , తమ్ముడిలా ఉన్నారంటూ పంచ్‌ వేశాడు. దీంతో అవినాష్‌ మరింత ఏడుస్తున్నట్లు నటించాడు. అక్కడ ఒక ఫన్నీ క్రియోట్‌ చేశాడు అవినాష్‌. దివి, అభి మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని సందర్భాలలో వేరేలా ప్రవర్తిస్తుంటావని అభి ముఖంపైనే దివి చెప్పేసింది. నేనైతే నిన్నే నామినేట్‌ చేస్తాను. అని తేల్చి చెప్పింది. 

అనంతరం  అఖిల్‌, సోహైల్‌ను స్టోర్‌ రూమ్‌లో ఉన్న దుస్తులు ధరించాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఆ దుస్తుల్ని ధరించి ఏదో హీరోల్లాగా ఫీల్‌ అయిపోయారు. ఇక సోమవారం నామినేషన్‌ ప్రారంభమైంది. ఇంట్లో ఇద్దరు హిట్‌ మెన్‌లు(అఖిల్‌, సోహైల్‌) ఉంటారు. మిగిలిన ఇంటి సభ్యులంతా లివింగ్‌ ఏరియాలో ఉండాలి. ప్రతి ఒక్కరికి బిగ్‌బాస్‌ 10 వేల రూపాయలు ఇస్తాడు. అలాగే ఇద్దరు హిట్‌మెన్‌లకు ఒక్కొక్కరికి 5 వేలు ఇస్తాడు. సమయానుసారం ఇంట్లో 5 బజర్లు మోగుతాయి. ప్రతి బజర్‌ మోగినప్పుడు లాంజ్‌లోకి ఎవరు మొదటగా వస్తే  వారే హిట్‌మెన్‌లతో మర్డర్‌ డీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎవరినైతే చంపాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పి, అంందుకు గల కారణాలను వివరించాలి. చనిపోయిన వ్యక్తి నాయినేట్‌ అయినట్లు. ఈ వారం ఇంటి కెప్టెన్‌ అయిన కారణంగా గంగవ్వ, అరియానాను దేవి సేఫ్‌ చేసినందున తనను కూడా ఇంటి సభ్యులెవరు  నామినేట్‌ చేయరాదు.

ఈ టాస్క్‌లో ముందు బజర్‌కు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ వచ్చారు. వచ్చి రాగానే తను స్వాతిని చంపాలి అనుకుంటున్నట్లు వెల్లడించారు. స్వాతి ఇటీవల వచ్చినట్లు తనకు ఎవరితో ఎక్కువ కాంటాక్ట్‌ అవ్వడం లేదని చెప్పారు. అలాగే స్వాతి కొంచెం హౌజ్‌లో నటిస్తుందని తెలిపాడు. వెంటనే గన్‌ తీసుకొని స్వాతిని అఖిల్‌ మర్డర్‌ చేశాడు. అయితే తనను నామినేట్‌ చేసినందుకు స్వాతి కొంచెం ఫీల్‌ అయ్యింది. అనంతరం మాస్టర్‌తో కొంచెం సీరియస్‌ అ‍య్యింది. రెండోసారి మొహబూబ్‌ ఇంట్లోకి మొదట వచ్చాడు. అభిని చంపేందుకు ప్లాన్‌ ఇచ్చుకున్నాడు. రోబో టాస్క్‌లో భాగంగా గల్లీ బాయ్స్‌అని అభి ఎగతాళి చేసినట్లు కారణంగా చెప్పుకొచ్చాడు. రెండోసారి కూడా అఖిల్‌ గన్‌ అందుకొని అభిని షూట్‌ చూసి నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు. 

మోహబూబ్‌ చాలా ముక్కోపి
మూడో బజర్‌కు అరియానా ముందుగా రూమ్‌లో వచ్చి లాస్యను చంపేందుకు ప్లాన్‌ ఇచ్చింది. అరియానా వల్ల ఇంటి సభ్యులంతా ఇరిటేడ్‌ అవుతున్నారని లాస్య చెప్పిందని, దాని వల్ల తనపై బయట తప్పుగా చూపిస్తుందని తెలిపింది. అది పక్కా అబద్దం అని తెలిపింది. మళ్లీ తనను నామినేట్‌ చేయటానికి అన్ని దెబ్బలు తగిలించుకొని వెళ్లలా అని లాస్య వెటకారంగా మాట్లాడింది. అయితే మధ్యలో ప్రతి సారి అఖిల్‌కు మర్డర్‌ డీల్‌ వస్తుందని అసూయతో సోహైల్‌ అఖిల్‌ డబ్బులను తన సూట్‌కేస్‌లోకి మార్చుకున్నాడు. నాలుగో బజర్‌కు వచ్చిన అలేఖ్య హారిక తన ఫ్రెంఢ్‌ మెహబూబ్‌ను అంతం చేసేందుకు డీల్‌ మాట్లాడుకుంది. టాస్క్‌లో భాగంగా మోహబూబ్‌ చాలా ముక్కోపిగా వ్యవహరించాడని, ఓవర్‌ కన్ఫిడెన్స్‌ కనిపించిందని తెలిపింది. ఈ సారి సోహైల్‌కు గన్‌ దొరికి మోహబూబ్‌ను చంపేశాడు. 

అయిదో బజర్‌కు తెలివిగా నటించినట్లు చేస్తూ నోయల్‌ ఇంటి నుంచి కాకుండా గార్డెన్‌ ఏరియా నుంచి రూమ్‌లోకి వచ్చాడు. కానీ నిబంధనల ప్రకారం ఇంట్లో నుంచి రావాలి కాబట్టి నోయల్‌ ను ఆపేసి తన తర్వాత వచ్చిన సుజాత రూమ్‌లోకి వెళ్లింది. వెంటనే కుమార్‌ సాయిని నామినేట్‌ చేసింది. ఎంత ప్రయత్నించినా కుమార్‌ కలవడం లేదని, టాస్క్‌లో లీనం అవ్వడం లేదనే కారణంతో మర్డర్‌ డీల్‌ కుదుర్చుకున్నాడు. అఖిల్‌ వచ్చి కుమార్‌ను మర్డర్‌ చేశాడు. అయిదు బజర్‌లు అయిపోయాకా కూడా సోహైల్‌ అఖిల్‌ సూట్‌కేస్‌ లాక్కునేందుకు ప్రయత్నించాడు. చివరకు ఎవరి సూట్‌కేస్‌లో ఎంత డబ్బు ఉంటే వాళ్లు సేఫ్‌ అయినట్లు కావడంతో అఖిల్‌ వద్ద ఎక్కువ ఉండటంతో అఖిల్‌ సేఫ్‌ అయ్యాడు. దీంతో అఖిల్‌ ఒక్కరిని నామినేట్‌ చేయాల్సి ఉండగా, హారికను నామినేట్‌ చేశాడు. అఖరుగా ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు స్వాతి, అభిజిత్‌, మెహ‌బూబ్‌, లాస్య, హారిక, కుమార్‌సాయి, సోహైల్‌ నామినేట్‌ అయ్యారు. మరి ఎవరూ ఉంటారో, ఎవరూ ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement