
బిగ్‌బాస్ నాల్గో సీజన్ రసవత్తంగా మారింది. కంటెస్టెంట్స్ అంతా ముసుగు తీసి మనసుకు నచ్చినట్లుగా ఆడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌ని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తమ రహస్యాలను కూడా బహిర్గతం చేయడానికి వెనకాడటం లేదు. ఇక బిగ్‌బాస్ పుణ్యమా అని యాంకర్ లాస్య గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటపడుతున్నాయి. లాస్యకు పెళ్లి అయిన విషయమే చాలా కాలం వరకు ఫ్యాన్స్‌కి తెలియదు. 2012 లో ప్రేమ వివాహం చేసుకుంటే.. ఆ విషయాన్ని 2017లో రివీల్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. బిగ్‌బాస్‌లోకి వచ్చాక లాస్య వాళ్ల తల్లిదండ్రులతో పాటు ఫ్యాన్స్‌కి కూడా షాక్‌ల మీద షాక్ ఇస్తోంది. ఇప్పటికే తాను ఒకసారి అబార్షన్ చేయించుకున్నానని చెప్పి షాకిచ్చిన లాస్య.. తాజాగా మరో రహస్యం చెప్పి అందరికి విస్మయానికి గురి చేసింది.
గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇప్పటివరకూ ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో ఒక్కొక్కరు వచ్చి తమ తమ సిక్రెట్ విషయాలను బిగ్‌బాస్‌తో పంచుకున్నారు. ఇక లాస్య వంతు రాగానే బిగ్ సిక్రెట్ చెప్పి అందరికి షాకిచ్చింది. తన భర్త తన కంటే ఏడాది చిన్నవాడని, చాలా పేదవాడని చెప్పుకొచ్చింది.
‘2017లో పెద్దల సమక్షంలో మా పెళ్లి అయ్యింది. పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పా.. అందరూ అనుకున్నారు.. కోటీశ్వరుడు డబ్బులున్న అబ్బాయి అనుకున్నారు. తను మిడిల్ క్లాస్ కూడా కాదు. అతని ఫైనాన్సియల్ స్టేటస్ నాకు మాత్రమే తెలుసు. నాకంటే ఆ అబ్బాయి ఒక సంవత్సరం చిన్న. ఆ విషయం తెలిసిన తరువాత నాకంటే ఏడాది చిన్నవాడ్ని నేను లవ్ చేశానా?? అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఈ సీక్రెట్ మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈ షోకి వచ్చాక షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నా.. అమ్మా మీ అల్లుడు నాకంటే ఏడాది చిన్న.. కానీ వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు.. చాలా బాగా చూసుకుంటాడు’ అని చెబుతూ కంటతడి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment