నేను ఊర మాస్‌, ఇంకా గ‌లీజ్‌గా మాట్లాడ‌తా: హారిక‌ | Bigg Boss 4 Telugu: These Contestants Are Nominated For 11th Week | Sakshi
Sakshi News home page

నాతో జాగ్ర‌త్త‌: సోహైల్‌కు అభిజిత్‌ వార్నింగ్‌

Published Mon, Nov 16 2020 11:34 PM | Last Updated on Tue, Nov 17 2020 5:32 AM

Bigg Boss 4 Telugu: These Contestants Are Nominated For 11th Week - Sakshi

నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో బిగ్‌బాస్ హౌస్ నిప్పుల‌గుండంగా మారింది. మాట‌ల‌ను సూదుల్లా గుండెకు గుచ్చుతూ కంటెస్టెంట్లు నిప్పుర‌వ్వ‌ల్లా ఎగిరెగిరి ప‌డ్డారు. ఈ క్ర‌మంలో కొంద‌రు లాజిక్ మరిచిన‌ట్లు తెలుస్తోంది. గేమ్ ఆడ‌టం లేదంటూ ఎక్కువ మంది అభిజిత్‌ను టార్గెట్ చేశాడు. మ‌రికొంద‌రు నామినేష‌న్‌ను తీసుకోలేక‌పోయారు. మండే అగ్నిగోళంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

మ‌ట‌న్ పంపిన నాగ్‌
బిగ్‌బాస్ ఇంటికి సింహం కెప్టెన్ అయ్యాడంటూ సోహైల్ అఖిల్‌కు కెప్టెన్సీ బ్యాండ్ తొడగ్గా, అత‌డు లాస్య‌ను రేష‌న్ మేనేజ‌ర్‌గా నియ‌మించాడు. ఇచ్చిన మాట ప్ర‌కారం నాగార్జున మ‌ట‌న్ పంప‌డంతో ఇంటిస‌భ్యులు సంతోషంతో ఎగిరి గంతేశారు. అనంత‌రం ప‌ద‌కొండో వారానికి గానూ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ప్ర‌యాణంలో ఎవ‌రు వ‌ర‌స్ట్ ప‌ర్ఫామెన్స్ అనుకుంటున్నారో, వారిని నామినేట్ చేయాల‌ని ఆదేశించాడు. ఇత‌ర కార‌ణాలు కూడా చెప్పేందుకు అవ‌కాశం క‌ల్పించాడు. మొద‌ట‌గా కెప్టెన్ అఖిల్ అభిజిత్ గుండె మీద గురి చూసి బాణం దింపాడు. నేను వెళ్లిపోయాక నా గురించి న‌వ్వుకున్నావు, రోబో టాస్క్ త‌ప్ప మిగ‌తావేవీ ఆడ‌టం లేదు అని త‌న అభిప్రాయాన్ని చెప్పాడు. (చ‌ద‌వండి: సినిమా ఛాన్స్ అన‌గానే రూ.80 వేలు ఇచ్చి మోస‌పోయా: అవినాష్‌)

అఖిల్‌, నీ గుడ్లు కింద ప‌డిపోతాయ్‌..
మ‌ట‌న్ షాపు య‌జ‌మాని గ‌డ్డి చూపిస్తే మేక లోప‌లికి వెళ్లింది, త‌ర్వాత ఏమైంది అని అభితో అంటూ మేక పులై వ‌చ్చింద‌ని అఖిల్‌ డైలాగ్ కొట్టాడు. దీంతో అఖిల్ మిస్స‌యిన లాజిక్ ప‌ట్టుకుని అభి.. మేక ఎప్పుడూ పులి కాదు, బ‌లైతద‌‌ని కౌంట‌రిచ్చాడు. అలా ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ షురూ అయింది. నా సోచ్ గురించి మాట్లాడావు అని అభి చెప్ప‌గానే అస‌లు నీకు బుద్ధి ఉంటే క‌దా? అని అఖిల్ నోరు జారాడు. దీంతో రెచ్చిపోయిన అభి కూడా ఇంత జ‌రిగినా నీకు బుద్ధి రాలేదు,  ముందు నువ్వు గుడ్లు బ‌య‌ట‌కు తీయ‌కు, కింద‌కు ప‌డిపోతాయ్ అని వెట‌కారంగా మాట్లాడాడు. నువ్వేమైనా తురుమ్‌ఖాన్‌వా? కెప్టెన్ అయ్యావ‌ని చెట్టెక్కి కూర్చున్నావు. అని గ‌రమ‌య్యాడు. ఇంత‌లో ఒక‌మ్మాయి గురించి అని అఖిల్ స్టార్ట్ చేయ‌బోతుంటే అమ్మాయి విష‌యం మ‌ధ్య‌లోకి లాగ‌కు అంటూ కొట్టుకున్నంత ప‌ని చేశారు. నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్నంత ప‌ని చేశారు. నాకు 32, నీది 25 ఏళ్లు.. బ‌చ్చాగానివి.. ఛ‌ల్‌ఛ‌ల్‌, జా అంటూ అఖిల్ నోరు మూయించేందుకు ప్ర‌య‌త్నించాడు. అయినా స‌రే త‌గ్గ‌ని అఖిల్ 25 ఏళ్ల‌లోనే తాను బిగ్‌బాస్‌కు వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చాడు.

ఊత‌ప‌దాల మీద లొల్లి
త‌ర్వాత అరియానా.. నేను నీకు కాంపిటీష‌న్ కాద‌న్నారు. కానీ గేమ్‌లో అంద‌రూ స‌మాన‌మే. బిగ్‌బాస్ ఏకాభిప్రాయంతో ఒక పేరు చెప్ప‌మ‌న్న‌ప్పుడు మీరు చెప్పకుండా గేమ్‌ను ముందుకు తీసుకెళ్ల‌లేదు అంటూ లాస్య‌ను, ఆ త‌ర్వాత అభిజిత్‌ను నామినేట్ చేసింది. ఇక సోహైల్‌.. త‌న‌ను చిచ్చుబుడ్డి అన్న‌వారికి థ్యాంక్స్ చెప్పాడు. ఆటంబాంబు క‌న్నా చిచ్చుబుడ్డే బెట‌ర్ అని అభిప్రాయ‌ప‌డ్డాడు. కానీ హారిక మాత్రం ఎవ్వ‌రూ దేఖ‌రు, వేస్ట్‌గాడు అని చిచ్చుబుడ్డి ఇచ్చింది. ఆమెను ఎప్పుడూ ఒక్క‌మాట అన‌లేదు అని బాధ‌ప‌డుతూనే సీరియ‌స్ అయ్యాడు. దీనిక హారిక స్పందిస్తూ నీ అవ్వ పో అన‌డం నీకు ఊత‌ప‌దం అయిన‌ప్పుడు వేస్ట్‌గాడు అనేది నాకు ఊత‌ప‌దం అని స్ప‌ష్టం చేసింది. అలా ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. దీంతో గింతంత లేవు, ఆపు అని సోహైల్ కావాల‌ని రెచ్చ‌గొట్టాడు. దీంతో ఆమె నా హైట్‌ను ఎందుకు అంటున్నావు. నువ్వు మాస్ అయితే నేను ఊర‌మాస్ అని ఆవేశ‌ప‌డింది. త‌న‌తో రుబాబుగా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఇక‌ రోబో టాస్క్ త‌ర్వాత మ‌ళ్లీ అంత ప‌ర్ఫామెన్స్ క‌నిపించ‌లేద‌ని అభిజిత్‌ను నామినేట్ చేశాడు.

ఇక నుంచి నో చెప్తా: మోనాల్‌
లాస్య మాట్లాడుతూ.. ఒక‌రిని బ‌య‌ట‌కు పంపించ‌డానికి ఐక‌మ‌త్యంగా లేన‌ప్పుడు ఉంచ‌డానికి ఐక‌మత్యంగా ఎందుకు ఆలోచించ‌లేదంటూ అరియానాను నామినేట్ చేసింది. టాస్కుల్లో పెద్ద‌గా ఆడ‌లేద‌ని, కొన్నిసార్లు ప‌నులు ఎక్క‌డివ‌క్క‌డే వ‌దిలేస్తుంద‌ని మోనాల్‌ను నామినేట్ చేసింది. హారిక‌.. చాలాసార్లు కెప్టెన్సీ పోటీ వ‌ర‌కు వ‌చ్చాను, ఈసారి కెప్టెన్సీకి స‌పోర్ట్ చేయ‌మ‌ని అడిగిన‌ప్పుడు ఓడిపోవ‌డం నీ త‌ప్పు అన్నాడు. అందుకు బాధేసింది అని సోహైల్‌ను, త‌ర్వాత మోనాల్‌ను నామినేట్ చేసింది. మోనాల్‌.. త‌న‌కు అప్ప‌జెప్పిన‌ ప‌నిని ఎప్పుడూ చేస్తాన‌ని లాస్య‌, రేష‌న్ మేనేజ‌ర్‌గా స‌క్ర‌మంగా ప‌ని చేయ‌లేద‌ని అవినాష్‌ గుండెల మీద బాణాల్ని గుచ్చింది. అవినాష్‌.. ప‌ని చెప్తే చేస్తాన‌న‌డం నేర్చుకో అని మోనాల్‌కు చెప్ప‌డంతో ఇప్ప‌టినుంచి నో చెప్తాన‌ని చెంప‌ పెట్టుగా స‌మాధాన‌మిచ్చింది. టాస్కులు ఆడ‌టం లేద‌ని అభిజిత్‌ను గుండెలో బాణం దించాడు. (చ‌ద‌వండి: అఖిల్ ప్ర‌వ‌ర్త‌న‌పై మోనాల్ ఫ్యాన్స్ ఫైర్‌)

నాతో మ‌ర్యాద‌గా మాట్లాడు: అభిజిత్‌
అభిజిత్ వంతు రాగా‌.. ఏకాభిప్రాయంతో మావైపు నిల‌బ‌డ‌లేద‌ని అరియానా గుండె మీద బాణం గుచ్చాడు. అయితే మీ ఆట‌కు అడ్డుప‌డే వారి పేరును ఏకాభిప్రాయంతో చెప్పాల‌ని బిగ్‌బాస్ చెప్పాడ‌ని, అందుకు ఎవ‌రి పేర్లు వారు చెప్పుకోవ‌డం త‌ప్ప‌ని నాగార్జున దీన్ని ఖండించిన విష‌యం అభి మ‌ర్చిపోయిన‌ట్టున్నాడు. కాగా.. నీయ‌వ్వ అని నాతో మాట్లాడొద్ద‌ని చెప్పినా అలాగే మాట్లాడుతున్నాడ‌ని సోహైల్‌ను నామినేట్ చేశాడు. దీంతో అగ్గి మీద గుగ్గిల‌మైన సోహైల్‌ 'అంటే నేను నాలాగా మాట్లాడ‌కూడ‌దు. పాష్‌గా మాట్లాడాలి' అంటూనే హ‌ర్ట్ అయితే సారీ అని చెప్పాడు. నీ ఊత‌ప‌దాలు నా ద‌గ్గ‌ర వ‌ద్దు. నాతో మ‌ర్యాద‌గా మాట్లాడు, జాగ్ర‌త్త‌గా ఉండు అని అభి వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం హౌస్‌ను అత‌లాకుత‌లం చేసిన నామినేషన్ లిస్టులో అభిజిత్‌, మోనాల్‌, హారిక‌, లాస్య‌, అరియానా, సోహైల్ ఉన్నారు.

నేను అంత‌కంటే గలీజుదాన్ని
ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని హారిక‌.. లాస్య ద‌గ్గ‌ర త‌న ఉక్రోశం చూపించింది. 'సోహైల్ అరుచుకుంటూ మాట్లాడితే నేను మూసుకుని ఉండ‌లేను. నేను మ‌రీ మాస్‌, ఇంకా గ‌లీజ్‌గా మాట్లాడ‌తా..' అని ఆవేశంతో ఊగిపోయింది. అటు సోహైల్ కూడా అరియానా ద‌గర త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు. న‌న్ను వేస్ట్ అంటే చాలా హ‌ర్ట్ అయినా, అది కూడా హ‌ర్ట్ కావాల‌నే గింతంత లేవు అన్నా అని తెలిపాడు. అదే మాట అభిని అనుంటే అత‌డు ఊరుకునేవాడే కాద‌ని చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: రెండేళ్ల క్రితం రిలేష‌న్‌లో ఉన్నా: హారిక‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement