‌అఖిల్‌, మోనాల్‌ను గంగ‌వ్వ విడ‌దీస్తోందా? | Bigg Boss 4 Telugu: Gangavva Prank Monal Gajjar | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: హారిక ఇజ్జ‌త్ తీసిన గంగ‌వ్వ

Published Sat, Sep 26 2020 11:28 PM | Last Updated on Sun, Sep 27 2020 4:01 PM

Bigg Boss 4 Telugu: Gangavva Prank Monal Gajjar - Sakshi

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యానికి నివాళులిస్తూ బిగ్‌బాస్ షో ప్రారంభ‌మైంది. కానీ కంటెస్టెంట్ల‌కు మాత్రం ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను తెలియ‌జేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌ రోజురోజుకీ ఆట‌లో మ‌రింత రాటు దేలుతున్న‌ గంగ‌వ్వకు అఖిల్ అంటే ఇష్టం. మోనాల్ అంటే క‌ష్టం. దీంతో నేటి ఎపిసోడ్‌లో వారిద్ద‌రినీ  వేరు చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇదిలా వుంటే కింగ్ నాగార్జున‌ ఇద్ద‌రు అమ్మాయిలు సేఫ్‌ అయిన‌ట్లు వెల్ల‌డించారు. వారెవ‌రో, నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చ‌దివేయండి..

అఖిల్ ద‌త్త‌పుత్రుడిగా తీసుకువెళ్తా: గ‌ంగ‌వ్వ‌
గంగ‌వ్వ ఈ మ‌ధ్య మ‌రీ హుషారుగా క‌నిపిస్తోంది. అంతేకాదు, మోనాల్‌ను కూడా ఏడిపించేసింది. నీతో మాట్లాడ‌క‌ని అఖిల్‌కు నేనే చెప్పాన‌ని అవ్వ అన‌డంతో నిజ‌మ‌ని న‌మ్మిన మోనాల్ కంట‌త‌డి పెట్టుకుంది. దీంతో ఊరికే అన్నాన‌ని బుజ్జ‌గించింది. ఇక త‌నకు ఎంతో ఇష్ట‌మైన అఖిల్‌ను ద‌త్త‌పుత్రుడిగా స్వీక‌రిస్తాన‌ని చెప్పుకొచ్చింది. మ‌రి అత‌డికి భార్య‌గా ఆమె వ‌ద్దా అని లాస్య.. మోనాల్ వైపు వేలు పెట్టి చూపిస్తే ఛీ, ఇక్క‌డున్న‌వాళ్లు వ‌ద్దు అని తేల్చి చెప్పింది. అలాగే నాగ్ ముందు కూడా మోనాల్‌కు గ‌ట్టిగానే కౌంట‌ర్లు ఇచ్చింది. అమ్మాయిలు అమ్మాయిల‌తో, అబ్బాయిలు అబ్బాయిల‌తో ఉండాల‌ని తేల్చి చెప్పింది. చూస్తుంటే త‌న అఖిల్.. మోనాల్‌తో ఉండ‌టం అవ్వ‌కు ఏమాత్రం ఇష్టం లేన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రోవైపు అరియానాలో రోజురోజుకీ గెల‌వాల‌న్న క‌సి పెరిగిపోతోంది. ఈ సీజ‌న్‌లో అమ్మాయే గెల‌వాల‌ని బ‌లంగా కోరుకుంటోంది. ఒక‌వేళ‌ తాను వెళ్లిపోతే, త‌న బాధ్య‌త‌ను స్వీక‌రించాల్సిందిగా దేవి నాగ‌వ‌ల్లి ద‌గ్గ‌ర మాట తీసుకుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: విశ్వ‌రూపం చూపించిన గంగ‌వ్వ‌)

ఏ అక్ష‌రం మైండ్‌లోనూ ఉంది: మోనాల్‌
నామినేష‌న్‌లో ఉన్న ఏడుగురితోనే నాగ్ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా నాగ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఇలా స‌మాధానమిచ్చారు. ఇంట్లో కుమార్ సాయి త‌న‌కు పోటీయే కాద‌ని హారిక తెలిపింది. ఇంట్లో నార‌దుడు సోహైల్ అని మోనాల్‌ తెలిపింది. ఆమెతో నాగ్‌ మాట్లాడుతూ నీ మ‌న‌సులో ఏ అక్ష‌రం ఉంద‌ని నాగ్ చెప్ప‌డంతో, మైండ్‌లో కూడా ఉన్నార‌ని న‌వ్వేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ ఉత్త‌మ అబ‌ద్ధాల కోరు అని లాస్య ప్ర‌క‌టించింది. మ‌రోవైపు కిడ్నాప్ ప్లాన్ అభిజిత్‌దే అని లాస్య చెప్తుంటే కాదు తాను చెప్పానని గంగ‌వ్వ అడ్డు ప‌డింది. ఇక‌ ఎలిమినేట్ అయిన వారిని  కుమార్ సాయి స్థానంలోకి తీసుకురావ‌చ్చ‌ని దేవి నాగ‌వ‌ల్లి పేర్కొంది. ఎందుకంటే అత‌డిలో ఇంకా క్లారిటీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: గంగ‌వ్వ‌కు అత‌డిష్టం, ఆమె క‌ష్టం)

ఒక‌రంటే మ‌రొక‌రికి మ‌హా చిరాకు
సోహైల్ ఇంట్లో త‌న‌కు బాగా చిరాకు తెప్పించే వ్య‌క్తి అని అరియానా చెప్ప‌గా, త‌న‌కు కూడా చిరాకు తెప్పించే వ్య‌క్తి అరియానా అని సోహైల్ పేర్కొన్నాడు. కుమార్ సాయికి అస‌లు ఇంట్లో ఉండేందుకు అర్హ‌త లేద‌ని మెహ‌బూబ్ చెప్పుకొచ్చాడు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు కూడా ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని తెలిపాడు. సోహైల్, తాను క‌ర్ణార్జున‌లా క‌నెక్ట్ అయ్యామ‌ని మెహ‌బూబ్ త‌న స్నేహాన్ని చాటుకున్నాడు. ఈ ఇంట్లో అత్యంత న‌కిలీ వ్య‌క్తి అభి అని కుమార్ సాయి అభిప్రాయ‌ప‌డ్డాడు. టాస్క్‌లో నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నాడ‌ని బాధ‌ప‌డ్డాడు. "24 ఏళ్ల‌ అఖిల్.. పెద్ద చ‌దువులు చ‌దివిన న‌న్ను ఒరేయ్ అంటాడా? అని అభిజిత్ పంచాయ‌తీ చేశాడు. కానీ అత‌ను కోరుకున్న గౌర‌వం వేరేవాళ్ల‌కు(నాకు) కూడా ఇవ్వాలి క‌దా అని బాధ‌ప‌డ్డాను. ఈ విష‌యంలో అత‌ను సారీ చెప్ప‌క‌పోతే ఎలిమినేట్ అయ్యేంత‌వ‌ర‌కు అత‌డినే నామినేట్ చేస్తాను" అని కుమార్ చెప్ప‌డంతో అభి మ‌రో ఆలోచ‌న చేయ‌కుండా క్ష‌మాప‌ణ కోర‌డం విశేషం.

ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని మ‌నుషుల టీమ్‌
కానీ ఆ వెంట‌నే అఖిల్ తానెప్పుడూ అరేయ్ అని అన‌లేద‌ని గ‌ర‌మ‌వ‌డంతో, ఇప్ప‌టికే దీని గురించి మాట్లాడుకున్నామ‌ని అభి క్లారిటీ ఇచ్చాడు. ఇక గ‌త టాస్క్‌లో ఓడిపోయిన మ‌నుషుల టీమ్ ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఓట‌మి చెందిన మ‌న‌సు మంచిది అని సంకేతాలు ఇస్తూ ర్యాప్ సాంగ్ పాడారు. ఇంటి స‌భ్యులంద‌రూ రోబోల టీమ్‌లో మ‌హా నాయ‌కుడుగా గంగ‌వ్వ పేరు చెప్తే నాగ్ మాత్రం యుద్ధం చేశాడంటూ అభిజిత్ పేరు చెప్పారు. అవినాష్‌కు మ‌హా కంత్రి అవార్డు బ‌హుక‌రించారు. గంగ‌వ్వ‌కు మ‌హా న‌టి అవార్డు బ‌హుక‌రించారు. ఆమె ట్రాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన క్లిప్పింగ్‌ను చూపించారు. అది చూసి మ‌నుషుల టీమ్ షాక్‌కు లోన‌య్యారు. అటు అవ్వ కూడా ఇదంతా టీవీలో వ‌చ్చిందా అని ఖంగు తింది. త‌ర్వాత లాస్య సేఫ్ అయిన‌ట్లు ప్రక‌టించారు. (చ‌ద‌వండి: అభిజిత్‌లో ధోనీని చూశా: యాంక‌ర్ ర‌వి)

ఇంటి స‌భ్యుల్లో మీకు న‌చ్చ‌నిది
ఇంటి స‌భ్యులు ఒక్కొక్క‌రుగా ఒక్కో కంటెస్టెంటులో న‌చ్చ‌ని గుణం ఏంటో చెప్పుకొచ్చారు. అఖిల్ చిన్న చిన్న విష‌యాల‌కే కోపానికొస్తాడ‌ని మోనాల్ బుంగ‌మూతి పెట్టుకుంది. మ‌రి త‌న‌ను ఒక్కోసారి అభి అని పిలుస్తుంద‌ని అఖిల్ చిన్న‌బుచ్చుకున్నాడు. కుళ్లు జోకులేస్తున్నాడ‌ని నోయ‌ల్ మాస్ట‌ర్‌పై ఫిర్యాదు చేశాడు. కానీ ఆయ‌న‌ ‌చిన్న‌పిల్లాడ‌ని అంత‌లోనే వెన‌కేసుకొచ్చాడు. అభి క‌నిపించేంత అమాయ‌కుడు కాద‌ని దివి పేర్కొంది. గంగ‌వ్వ ఇష్ట‌ప‌డే వాళ్లు త‌ప్పు చేసినా వారినే స‌పోర్ట్ చేస్తుంద‌ని దేవి అభిప్రాయ‌ప‌డింది. ఇంట్లో ఏమైపోతుందా అని లాస్య ఊరికే  కంగారు ప‌డిపోతుంద‌ని అవినాష్ చెప్పుకొచ్చాడు.

స్వాతి దీక్షిత్ ప్రిపేర్ అయి వ‌చ్చింది
అభి అంద‌రితో క‌ల‌వ‌ట్లేద‌ని సుజాత చెప్పింది. ఏ, నీకు చెల్లె అన‌డం న‌చ్చ‌లేదా అని నాగ్‌ నిల‌దీయ‌డంతో నీళ్లు న‌మిలిన సుజాత‌.. లేదు, ఛీ అన‌డం మాత్ర‌మే న‌చ్చ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.. బ్ర‌ష్ చేసుకోకుండానే టీ, కాఫీలు తాగుతుంద‌ని అవ్వ హారిక ఇజ్జ‌త్ తీసింది. దివికి దేని‌కి ఏడ‌వాలో, దేనికి న‌వ్వాలో తెలీద‌ని మాస్ట‌ర్ చెప్పుకొచ్చాడు. స్వాతి ఎవ‌రితో క్లోజ్‌గా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుని వ‌చ్చింద‌ని లాస్య పేర్కొంది. అనంత‌రం మోనాల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement