Anchor Lasya Husband Manjunath Home Tour Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anchor Lasya: Home Tour: ఇల్లు అమ్మేస్తామని చెప్పిన యాంకర్‌ లాస్య.. కారణమిదే!

Published Wed, Mar 9 2022 9:29 PM | Last Updated on Thu, Mar 10 2022 4:59 PM

Anchor Lasya Husband Manjunath Home Tour Video - Sakshi

చీమ జోకులతో, చలాకీ యాంకరింగ్‌తో బాగా ఫేమస్‌ అయింది లాస్య మంజునాథ్‌. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లోనూ పాల్గొన్న లాస్య అటు షోలతో పాటు యూట్యూబ్‌ చానల్‌లోనూ సందడి చేస్తుంది. తాజాగా ఆమె తన అత్తారిల్లును అభిమానులకు చూపించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు యూట్యూబ్‌ చానల్‌లో అత్తగారి హోమ్‌ టూర్‌ వీడియోను షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ఇంటి విశేషాలు వెల్లడిస్తూ.. తన భర్త మంజునాథ్‌ తాతయ్య ఈ ఇల్లును రూ.25 వేలకే కట్టించాడంది. ఈ ఇంటిని కట్టించి దాదాపు 50 ఏళ్లు అవుతుందని పేర్కొంది. ఇప్పుడు అత్తామామ తమతో పాటే సిటీలో ఉంటున్నారని, త్వరలోనే ఈ ఇల్లును అ‍మ్మేయబోతున్నట్లు వెల్లడించింది.

ఇక ఈ ఇంటికి రెండు గుమ్మాలతో పాటు విశాలమైన గదులున్నాయి. హాల్‌, డైనింగ్‌ టేబుల్‌కో రూమ్‌, రెండు కిచెన్లు, దేవుడి రూమ్‌, బెడ్‌ రూమ్స్‌, స్టోర్‌ రూమ్‌ ఉన్నాయి. మోడ్రన్‌ మహాలక్ష్మి షోలో ఒక ఫ్రిజ్‌ గెలిచానని, అది ఈ ఇంట్లోనే ఉందని చూపించింది. ఇంటి ముందు రెండు కొబ్బరి చెట్లు, పెరట్లో మూడు మామిడి చెట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలా ఈ హౌస్‌తో తనకు ఉన్న అనుబంధాలను ఒక్కొక్కటినీ వివరించుకుంటూ పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement