
ఇంజనీరింగ్ అయ్యాక ఏదైనా సాధించాలని కలలు గనేది లాస్య. అలా అనుకోకుండా బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే పక్కింటి అమ్మాయిగా స్థిరపడిపోయింది. ఆమె తన జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుంది. అతను ప్రేమించిన వ్యక్తి మంజునాథ్‌తో 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి అందరి సమక్షంలో భర్తతో ఏడడుగులు నడిచింది. పెళ్లి చేసుకున్నాక టీవీకి దూరమైన లాస్య చాలా సంవత్సరాలకు మళ్లీ ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. కానీ మళ్లీ చీమ ఏనుగు జోక్స్ చెప్తూ అందరినీ భయపెట్టిస్తోంది. తానేంటో చూపించడానికి బిగ్‌బాస్ హౌస్‌కు వస్తున్నానంటోంది. ఇలాగే చలాకీగా ఉంటూ కంటెస్టెంట్లను తనవైపు తిప్పుకుని బిగ్‌బాస్‌లో ఎలా ప్రయాణం సాగిస్తుందో చూడాలి.