బిగ్‌బాస్ నేడు ఇంటిసభ్యులకు ఇస్తున్న టాస్క్ మూడో సీజన్‌ను గుర్తు చేస్తోంది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేశారంతే. బిగ్‌బాస్ ఇంటిసభ్యులను బ్లూ, రెడ్ టీమ్స్‌గా విడగొట్టారు. ఒకదాన్ని మించి మరొకటిగా వీరికి కష్టతరమైన టాస్కులు ఇస్తున్నాడు. అందులో భాగంగా హారిక తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే, ఏడుస్తూనే జుట్టు కత్తిరించుకునేందుకు సిద్ధపడిపోయింది. అయితే రెండో సీజన్‌లో దీప్తి సునయన, మూడో సీజన్‌లో శివజ్యోతి కూడా జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. కాకపోతే వీళ్లిద్దరూ నామినేషన్‌లో ఉన్న ఒకరిని సేవ్ చేసేందుకు ఆ పని చేశారు. ఇక కుమార్ సాయి తను వేసుకున్న డ్రెస్సును కత్తిరించుకోవడంతో పాటు మరో కఠినతరమైన టాస్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: అన్నయ్య లవర్‌ను అక్కా అనేవాడిని: అవినాష్ తమ్ముడు)
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం కుమార్ ఓ తాడుకు కట్టి ఉన్న బస్తాను కింద ఆనించకుండా పట్టుకోవాలి. ఈ టాస్క్ కూడా గత సీజన్లలో చూసిందే. అయితే ఎక్కువగా జిమ్ముల్లో చెమటలు చిందించడం అలవాటు లేని అతడికి ఇది చాలా కష్టమైన టాస్కే. అతను ఆ బస్తాను ఒంటి చేత్తో మోయలేక అరుపులు, కేకలు పెడుతూ ఏడ్చినంత పని చేశాడు. అతని అవస్థను చూసి ఇంటి సభ్యులు సైతం తెగ కంగారు పడిపోయారు. మరోవైపు స్టోర్ రూమ్‌లో ఉన్న పదార్థాలతో జ్యూసు తయారు చేసి దాన్ని రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ ఛాలెంజ్ పూర్తి చేసేందుకు లాస్య ధైర్యంగా ఓ అడుగు ముందుకేసింది. కానీ చిత్రవిచిత్రమైన ఆ జ్యూసును తాగడం ఆమెకు అత్యంత కష్టంగా ఉన్నప్పటికీ కళ్లు మూసుకుని గ్లాసులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నేటి ఎపిసోడ్‌లో మిగతా వారికి సైతం ఇలాంటి కఠినమైన టాస్కులే ఇచ్చినట్లు కనిపిస్తోంది. వాటిని ఇంటి సభ్యులు ఎలా పూర్తి చేస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్ : కెప్టెన్ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్ చేసిన సోహైల్)
Comments
Please login to add a commentAdd a comment