నటనా సామ్రాజ్యపు మహారాణి, సిరివెన్నెల విరబోణి సమంత బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో దసరా స్పెషల్ మహా ఎపిసోడ్‌కు వ్యాఖ్యాతగా వ్యహరించింది. ముద్దు ముద్దు మాటలతో షో ప్రారంభం నుంచే సందడి మొదలు పెట్టేసింది. కంటెస్టెంట్లు ఒక్కొక్కరి గురించి సమంత తన అభిప్రాయాలను చక్కగా చెబుతూనే అందరినీ తికమక పెట్టింది.. అరియానా ఫైటర్, జాలి గుండె అని చెప్తూనే ఆమెను చూస్తుంటే తనను తాను చూసినట్లే ఉందని తెలిపింది. దివి గేమ్‌పై ఫోకస్ పెట్టడం లేదంది. హారికకు బాగా క్లారిటీ ఉందంది. లాస్య నవ్వుతూనే అందరినీ బుట్టలో వేస్తుందని పేర్కొంది. మోనాల్ బిగ్‌బాస్ హౌస్‌లో చాలామందికి ప్రేమించడం నేర్పుతుందని అంది. ప్రతిసారి ఏడవకూడదని సలహా ఇచ్చింది. అబ్బాయిలు ఫీలైనా సరే వాళ్ల గురించి చెప్పనని తేల్చి చెప్పింది.
స్వయంవరం మొదటి రౌండ్ గెలిచిన అఖిల్
బిగ్‌బాస్ హౌస్‌లో సమంత స్వయంవరం ప్రకటించింది. ఇది మూడు రౌండ్లు ఉంటుందని తెలిపింది. మొదట వచ్చిన అభిజిత్ సాంగ్ పాడాడు. సోహైల్.. డైలాగులు చెప్తుంటే అరియానా అడ్డుపడింది. నువ్వూ నేను టామ్ అండ్ జెర్రీ అని ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నించి, ఆపై కండలు ప్రదర్శించాడు. అవినాష్.. తనను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నవ్విస్తానని హామీ ఇచ్చినా అమ్మాయిలు పడిపోలేదు. నా భార్యకు నేనే వండిపెడతా, ఏమడిగినే ఇచ్చేస్తానని చెప్పి మెహబూబ్ చొక్కా తీసేసి డ్యాన్స్ చేశాడు. బంగారు కళ్ల బుచ్చొమ్మో.. అంటూ అఖిల్ పాట పాడాడు. అనంతరం అమ్మాయిలందరూ అఖిల్ నచ్చాడని ఏకగ్రీవంగా ప్రకటించారు. దీంతో అతనికి ఓ స్పెషల్ గిఫ్ట్ అంటూ అఖిల్ ఇంటిసభ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు. (చదవండి: మోనాల్ మళ్లీ సేఫ్, దివి ఎలిమినేట్)
నీ రూమ్‌లోకి వెళ్లి నీ కోసమే ఆలోచిస్తున్నాం
"నిన్ను చాలా మిస్ అవుతున్నాం, నువ్వు ఏడవడం చూసి బాధపడ్డాం. కానీ మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పిన సంఘటన నా జీవితంలోని కష్టాలను పోగొట్టింది. నీ రూమ్‌లోకి వెళ్లి నీకోసమే ఆలోచిస్తున్నాం. అందరితో కలిసి ఉండు, మంచిగా ఆడు, అదే నాకు సంతోషం" అని అఖిల్ అమ్మ మాట్లాడింది. ఇది చూడగానే అఖిల్ కన్నీటిపర్యంతం అయ్యాడు. తర్వాత మోనాల్‌కు ఆమె ఫ్యామిలీ వీడియో చూపించారు. "మేము నిన్ను మిస్ అవుతున్నాం. నువ్వు లేకపోతే ఇల్లు బోసిగా ఉంది. నిన్ను ఏడుస్తూ చూడటం మాకు నచ్చట్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం" అని అమ్మ మాట్లాడిన వీడియో చూసి మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత నోయల్ వంతు వచ్చింది. "చూడు అన్నయ్యా.. నాన్న తొడగొడుతున్నాడు. నువ్వు కాస్త బాధపడినా మేమూ బాధపడతాం. ఆల్ ద బెస్ట్‌రా" అని అతడి తమ్ముడు మాట్లాడాడు. తర్వాత అరియానా సేఫ్ అయినట్లు సమంత వెల్లడించింది. (చదవండి: బిగ్‌బాస్ : తొలిసారి అవినాష్.. సోహైల్ రిక్వెస్ట్)
రెండో రౌండ్‌లోనూ గెలిచిన అఖిల్
స్వయంవరంలో 'ఎవడు పోటుగాడు' అని రెండో రౌండ్ మొదలైంది. అరియానా బర్త్ ఇయర్ ఎప్పుడు? అన్న ప్రశ్నకు 1993 అని అవినాష్, దివికి ఏది భయం? అన్న ప్రశ్నకు దెయ్యం అని అఖిల్, హారిక ఫేవరెట్ కలర్ బ్లాక్ అని మెహబూబ్ చెప్పాడు. మోనాల్ లక్కీ నంబర్ 2 అని అవినాష్ తప్పు ఆన్సర్ ఇవ్వడంతో అతికష్టం మీద శీర్షాసనం వేయించారు. తన లక్కీ నంబర్ నాలుగు అని మోనాల్ స్పష్టం చేసింది. దివి చెవికమ్మ రంగు బ్లూ అని మరోసారి తప్పులో కాలేయడంతో అవినాస్ ఈ రౌండ్ నుంచి తప్పుకున్నాడు. ఆడవాళ్లు మగవాళ్ల కన్నా ఎక్కువ మాట్లాడతారా? అన్న ప్రశ్నకు అవునని అభిజిత్, ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తాడన్న ప్రశ్నకు అబ్బాయిలు అని అఖిల్ ఆన్సరిచ్చారు. ఒక చీర ఎంత పొడవుంటుందంటే ఆరు అడుగులు అని అఖిల్, ఆడవాళ్లు వాడే బ్లాక్ కలర్‌లో మూడు మేకప్ ఐటమ్స్‌ను మెహబూబ్ కరెక్ట్‌గా చెప్పాడు. ఈ రౌండ్‌లో కూడా అఖిలే గెలిచాడు. ఒక్క పాయింట్ కూడా రాని సోహైల్ ఎలిమినేట్ అయ్యాడు. (చదవండి: నరకం చూపించిన ఆ ఇద్దరే బెస్ట్ పర్ఫార్మర్లు)
సింగరేణి ముద్దుబిడ్డ మేం బాగున్నాం.
"సింగరేణి ముద్దుబిడ్డ.. నీ గ్రాఫ్ పెరుగుతుంది. కథ వేరే ఉంది. మేం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. మేం బాగున్నాం. నాన్న మాత్రం చాలా గర్వంగా ఫీల్ అయితుండు. లవ్ యూ అన్నా" అంటూ తమ్ముళ్లు, "నేను చాలా సంతోషంగా ఉన్నా. నువ్వు బాగా ఆడుతున్నావు. గెలిచి రావాలి" అని తండ్రి మాటలను చూపించడంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. నాకు బాగోలేనప్పుడు మెహబూబ్, అఖిల్ బాగా చూసుకుంటూ, తినిపించారని సంతోషం వ్యక్తం చేశాడు. తర్వాత అమ్మ రాజశేఖర్ వంతు రాగా "నీ ఆరోగ్యం చూసుకో. టాస్క్‌ల్లో దెబ్బలు తగిలించుకోకు. నీ గుండు అవతారం బాగుంది. లవ్ యూ" అని భార్య, "మిగతావాళ్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావ్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం" అని కొడుకు, కూతురు మాట్లాడిన వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత దివి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "టాస్కులు బాగా ఆడుతున్నావ్. గెలిచి రావాలి. అదే మా కోరిక" అని చెప్పుకొచ్చారు. ఇది చూసి దివి చాలా సంతోషపడింది.
షోలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎంట్రీ
తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ షోలోకి వచ్చాడు. స్వయంవరంలో భాగంగా అఖిల్-మోనాల్, అభిజిత్-దివి, అవినాష్-హారిక డ్యాన్స్ చేయగా.. మెహబూబ్ జోడి బాగా చేసిందని అఖిల్ ప్రకటించాడు. తర్వాత మెహబూబ్, అరియానా, అవినాష్ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియోలను చూపించారు. ఇక హీరో అఖిల్ మాట్లాడుతూ.. మా గురించి మర్చిపోయి నాన్న మీ గురించే మాట్లాడుతన్నారని చెప్పుకొచ్చాడు. అనంతరం స్వయంవరంలో మెహబూబ్- అరియానాలను టాప్ జోడీగా ప్రకటిస్తూ స్నేహమాల వేయించి మెహబూబ్‌తో ఆమెకు రింగు తొడిగించాడు. తర్వాత మోనాల్, అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు.
స్వయంవరంలో టాప్ జోడీగా మెహబూబ్- అరియానా
అనంతరం లాస్య భర్త మాట్లాడుతూ.. "ఇంకెప్పుడూ ఏడవకు. నువ్వేడిస్తే ఇక్కడ చాలా మంది ఏడుస్తాం. జున్ను నీకోసం రాసిన లెటర్ చదువుతాను.. అమ్మ.. అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను అల్లరి చేస్తున్నాను. నిన్ను టీవీలో చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ ఏడవద్దు. లవ్ యూ అమ్మ" అని చెప్పుకొచ్చారు. జున్నును చూసి లాస్యకు కన్నీళ్లు ఆగలేవు. "హెయిర్ కట్ టాస్క్ చేసినందుకు ఎమోషనల్ అయ్యాం, కానీ టీమ్ కోసం త్యాగం చేయడం చాలా నచ్చింది. బీ సేఫ్. టాస్కులు ఇరగదీసేయ్" అని హారిక అన్నయ్య వీడియో సందేశం ఇచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం అరియానా త్యాగం)
మోనాల్ సొంత క్రష్ అనిపిస్తుంది: హైపర్ ఆది
తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, డిటెక్టివ్‌గా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే కంటెస్టెంట్లపై పంచులు విసిరాడు. అమ్మ రాజశేఖర్‌ను అపరిచితుడితో పోల్చాడు. సోహైల్ అర్జున్‌రెడ్డిలా ఉండేవాడని, ఇప్పుడు స్వాతిముత్యంలా తయారయ్యాడని చెప్పుకొచ్చాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావ్ కాబట్టే టీవీలో ఉన్నావు, లేదంటే టీవీ ముందు ఉండేవాడన్నాడు. మోనాల్‌ను చూస్తుంటే తన సొంత క్రష్‌లా అనిపిస్తుందని ఆది పులిహోర కలిపాడు. తన పేరు కూడా ఏతో మొదలవుతుందని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అనంతరం నోయల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత దివి ఎలిమినేట్ అని ప్రకటించడంతో మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు.
కిచెన్ వద్దనుకున్న లాస్యపై బిగ్‌బాంబ్
నీ తర్వాతి సినిమాలో దివికి ఓ మంచి పాత్ర ఇవ్వు అంటూ సమంత షోకు విచ్చేసిన కార్తికేయను అభ్యర్థించగా అతడు ఓకే చెప్పాడు. మరి మీతో ఒక సినిమా చేయాలనుంది అని కార్తికేయ మనసులోని మాటను బయటపెట్టగా సామ్ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇక వారం రోజుల పాటు ఒక్కరే వంట చేయాలన్న బిగ్‌బాంబ్‌ను దివి లాస్యపై వేసింది. తనకు అసిస్టెంటుగా లాస్య అభిజిత్‌ను ఎన్నుకుంది.
Comments
Please login to add a commentAdd a comment