చిరస్మరణీయురాలు ఇందిరా గాంధీ
చిరస్మరణీయురాలు ఇందిరా గాంధీ
Published Sat, Nov 19 2016 11:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
– కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. శనివారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని డీసీసీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుత.. ఇందిరా గాంధీ ప్రధామంత్రిగా పనిచేసిన సమయంలో బంగ్లా విముక్తికోసం పాకిస్తాన్‌పై యుద్ధం చేసి విజయం సాధించరన్నారు. పేదల కోసం బ్యాంకుల జాతీయికరణ, గరిబీ హఠవో, హరిత విప్లవాలను ప్రోత్సహించారన్నారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం వెనుక ఉన్న బండారాన్ని త్వరలో బయట పెడతామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ నాయకులంతా బైక్‌లపై ర్యాలీగా వచ్చి రాజ్‌విహార్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లారు.
ఉల్లిరైతును ఆదుకోవడంలో విఫలం
ఉల్లిరైతును ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లిని రోడ్లపైనే పడేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, శాసనమండలిలో విపక్షనేత రామచంద్రయ్య, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పనబాక లక్ష్మీ, కిల్లి కృపారాణి, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అతిథి గృహం నిర్వాహకులపై కోట్ల ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం నిర్వాహకులపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రెస్‌మీట్ నిర్వహణ కోసం మీటింగ్ హాల్‌ను ఇవ్వకపోడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు.అతిథి గృహం ఏమైనా కలెక్టర్/జేసీ సొంత ఆస్తినా అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు అయి ఉండి తెలుగుదేశం ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Advertisement
Advertisement