Onion farmer
-
ఉల్లి కిలో రూ.8 : కన్నీరు మున్నీరవుతున్న రైతు
సాక్షి, ముంబై: ఒకవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ఉల్లి రైతులు పండించిన పంటకు కనీస విలువ లభించక లబోదిబో మంటున్నారు. ఆరుగాలం శ్రమించిన పండించిన పంటకు సరియైన ధర లభించక కన్నీరు మున్నీరవుతున్నాడు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి దర సుమారు రూ.100 పలుకుతోంటే..అహ్మద్ నగర్‌కు చెందిన రైతుకు లభించింది మాత్రం రూ. 8. దీంతో రైతులు తీరని సంక్షోభంలో కూరుకుపోయిన రైతు పొలం నుంచి ఉల్లిపాయను తీసిన కార్మికులకు ఏమి చెల్లించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి? అని బిడ్డల్ని ఎలా పోషించాలంటూ కన్నీరు పెడుతున్న వైనం పలువుర్ని కదిలిస్తోంది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. రైతుల పరిస్థితి వారికి పట్టదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అటు విపరీతంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఒక లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయిచింది. దిగుమతి చేసుకున్న ఉల్లిని నవంబర్ 15- డిసెంబర్ 15 మధ్యకాలంలో దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇటీవల ప్రకటించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర పౌరులు తమ తీర్పునిచ్చి పద్దెనిమిది రోజులు గడిచాయి. కానీ బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం ఎవర్ని వరించబోతోందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. దీంతో రాష్ట్ర రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్‌తో భారీ మంతనాలు సాగించి చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధ మవుతుండటంతో, మహారాష్ట రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేచినట్టే. This is so heartbreaking! A poor farmer from Ahmednagar, #Maharashtra got a measly Rs 8/kg for his onion produce. He is devastated & doesn't know how he is going to pay labourers or feed his family. This is what the man busy trying to save his CM's chair has done for farmers! pic.twitter.com/Zv8sZHMUkw — Sunil Ahire (@SunilAh64145529) November 10, 2019 -
మోదీపై ఉల్లి రైతు వినూత్న ఆగ్రహం
ముంబై: పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతుధర రాకపోవడంపై మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. నాసిక్ జిల్లాలోని నిఫద్‌కు చెందిన సంజయ్ సాథే తన పొలంలో ఉల్లి పంట వేయగా 750 కేజీల దిగుబడి వచ్చింది. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్లగా కిలో రూ.1.40 చొప్పున రూ.1,064 వచ్చాయి. నెలల పాటు కష్టపడి వ్యవసాయం చేసినప్పటికీ కనీస పెట్టుబడి దక్కకపోవడంతో సంజయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఉల్లి అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రధాని విపత్తు సహాయ నిధికి పోస్ట్‌ద్వారా పంపాడు. రైతుల కష్టాలపై కేంద్రం వైఖరికి నిరసనగానే ప్రధానికి రూ.1,064 పంపాననీ, మనీఆర్డర్ కోసం మరో రూ.54 ఖర్చు అయ్యాయని సంజయ్ వెల్లడించాడు. సాగులో సరికొత్త పద్ధతులతో భారీ దిగుబడి సాధించినందుకు 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంజయ్ ఢిల్లీలో కలుసుకున్నాడు. -
ఉల్లిరైతు ఆత్మహత్య
-
ఉల్లి రైతు..కంటతడి
- మళ్లీ ధర పతనం - క్వింటాల్ రూ.2 వేలలోపు పడిపోయిన వైనం -అమ్ముకోలేక, ఉంచుకోలేక రైతుల అవస్థలు -గత ఏడాదిలాగే నష్టాలు తప్పవేమోనని ఆందోళన - పొలాల్లోనే మురుగుతున్న పంట కొద్దిరోజుల క్రితం మురిపించిన ఉల్లి.. ఇప్పుడు మళ్లీ కన్నీరు పెట్టిస్తోంది. ఉన్నట్టుండి ధర పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను అమ్ముకోలేక, అలాగని నిల్వ చేసుకోలేక అవస్థ పడుతున్నారు. కొందరు మాత్రం పొలాల్లోనే ఆరబెడుతున్నారు. మరికొందరు ధర మరింత పతనం అవుతుందేమోనన్న భయంతో అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుత ధర ఏమాత్రమూ గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు. కోడుమూరు రూరల్ : మార్కెట్లో రోజురోజుకూ పతనమవుతున్న ఉల్లి ధర రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే.. తీరా దిగుబడి వచ్చే సమయానికి ధర పడిపోతోంది. గత ఏడాది ఉల్లికి ఏమాత్రమూ ధర లేక రైతులంతా తీవ్ర నష్టాలపాలయ్యారు. అప్పట్లో క్వింటాల్ రూ.200 కూడా అమ్ముడుపోకపోవడంతో చాలామంది పంటను మార్కెట్లలోనే వదిలేసి వచ్చారు. దారి ఖర్చులకు కూడా అప్పు చేసి తిరిగిరావాల్సి వచ్చింది. మరికొందరు పంట తొలగించకుండా పొలాల్లోనే వదిలేశారు. కనీసం ఈసారైనా మంచి ధర వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 6,796 ఎకరాల్లో పంట సాగు చేశారు. గోనెగండ్ల, కోడుమూరు, మిడుతూరు, జూపాడుబంగ్లా, డోన్, ఆస్పరి, ప్యాపిలి మండలాల్లో ఎక్కువగా వేశారు. కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాల్లో 1,274 ఎకరాల్లో పంట సాగైంది. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. ఇదే సమయంలో ధర పతనం అవుతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముడుపోతేగానీ రైతులకు గిట్టుబాటు కాదు. 20 రోజుల క్రితం ఈ మేరకు ధర పలికింది. అప్పట్లో అమ్ముకున్న వారు లాభపడ్డారు. తర్వాత ధర పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం రూ.2 వేలలోపే ఉండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ధర పెరుగుతుందన్న ఆశతో చాలామంది పంటను తొలగించి పొలాల్లోనే ఉంచుకుంటున్నారు. మరికొందరు పొలం గట్ల వెంట ఉల్లిగడ్డలను కుప్పలుగా ఆరబోసుకుని ధర కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ధర పెరగకపోగా మరింత దిగజారుతుండడంతో ఉల్లిని ఎక్కువకాలం ఉంచితే కుళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.60 వేల దాకా పెట్టుబడి ఉల్లి పంట సాగుకు రైతులు ఎకరాకు రూ.60 వేల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఉల్లి నారుకు రూ.10 వేలు, నాటేందుకు రూ.6-8 వేలు, పురుగు మందులు, ఎరువులకు రూ.10 వేలు, సేద్యం, కలుపుతీతకు రూ.15 వేలు, పంట కోతకు రూ.12 వేల చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. పంట బాగా పండితే 60-70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్ రూ.2,500లకు పైగా అమ్ముడుపోతేనే రైతులు లాభపడతారు. ఈసారి వర్షాభావం కారణంగా ఉల్లిగడ్డలు సరైన సైజులో ఊరలేదు. దీనివల్ల ఆశించిన దిగుబడి రావడం లేదు. దీనికితోడు ధర కూడా తగ్గిపోతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎగుమతులకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఉల్లి ధర తగ్గుతోందని, వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించాలని వారు కోరుతున్నారు. పెట్టుబడికి సరిపోయింది - పాండురంగడు, కల్లపరి ఎకరన్నర విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశా. తీరా దిగుబడి వచ్చే సమయంలో ధర తగ్గిపోయింది. క్వింటాల్ రూ.1,400 ప్రకారం అమ్ముకున్నా. వచ్చిన డబ్బు పంట పెట్టుబడులకే సరిపోయింది. మా కష్టమంతా నేలపాలైంది. పంటంతా పొలంలోనే పెట్టుకున్నా - రాముడు, వర్కూరు ఎకరా పొలంలో ఉల్లి సాగు చేశా. పంట వచ్చే సమయానికి ధర లేకుండా పోయింది. ప్రస్తుతమున్న ధరకు అమ్మితే పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. తొలగించిన ఉల్లి పంటనంతా రెండు వారాల నుంచి పొలంలోనే పెట్టుకున్నా. ధర కోసం ఎదురు చూస్తున్నా. -
చిరస్మరణీయురాలు ఇందిరా గాంధీ
– కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. శనివారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని డీసీసీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుత.. ఇందిరా గాంధీ ప్రధామంత్రిగా పనిచేసిన సమయంలో బంగ్లా విముక్తికోసం పాకిస్తాన్‌పై యుద్ధం చేసి విజయం సాధించరన్నారు. పేదల కోసం బ్యాంకుల జాతీయికరణ, గరిబీ హఠవో, హరిత విప్లవాలను ప్రోత్సహించారన్నారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం వెనుక ఉన్న బండారాన్ని త్వరలో బయట పెడతామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ నాయకులంతా బైక్‌లపై ర్యాలీగా వచ్చి రాజ్‌విహార్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లారు. ఉల్లిరైతును ఆదుకోవడంలో విఫలం ఉల్లిరైతును ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లిని రోడ్లపైనే పడేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, శాసనమండలిలో విపక్షనేత రామచంద్రయ్య, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పనబాక లక్ష్మీ, కిల్లి కృపారాణి, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. అతిథి గృహం నిర్వాహకులపై కోట్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం నిర్వాహకులపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రెస్‌మీట్ నిర్వహణ కోసం మీటింగ్ హాల్‌ను ఇవ్వకపోడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు.అతిథి గృహం ఏమైనా కలెక్టర్/జేసీ సొంత ఆస్తినా అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు అయి ఉండి తెలుగుదేశం ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
ఉల్లిరైతు కంట కన్నీరు
-
రోడ్డెక్కిన ఉల్లి రైతు
– ధరలు పడిపోవడంతో ఆందోళన – ఉల్లిని రోడ్డుపై పోసి ధర్నా – వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి మద్దతు కర్నూలు(అగ్రికల్చర్): అసలే పడిపోయిన ఉల్లి ధరలు.. ఆపై మార్కెట్‌యార్డులోని వేలంపాటల్లో వ్యాపారుల ఆగడాలు వెరసి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఉల్లి పంటను పోసి తొక్కుతూ నిరసన తెలిపారు. మార్కెట్ కమిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు పురుగు మందు డబ్బాలు బయటకు తీయగా పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ యార్డులో వ్యాపారులు వేలం పాటలను రూ. 100 నుంచి ప్రారంభించి రూ. 150 ముగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉల్లికి కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మార్కెట్‌యార్డులో వేలం పాటలను రూ.500 నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. మరోవైపు రైతుల ధర్నా కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా వందలాదిగా వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పారు. అయినా ఫలితం లేకపోవడంతో విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్, సెక్రెటరీ దష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు చైర్పర్సన్ శమంతకమణి, కార్యదర్శి నారాయణమూర్తి, వైస్ చైర్మన్ దేవేంద్రరెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. ఉల్లిని గ్రేడింగ్ చేసుకువస్తే మంచి ధర లభిస్తుందంటూ సర్ధి చెప్పారు. వేలంపాటలను రూ.300 ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. మళ్లీ మొదటికే... మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ధర్నా అనంతరం వ్యాపారులు మళ్లీ రూ.100 నుంచే వేలంపాటలు ప్రారంభించి రూ.150, రూ.180కే ముగింపు పలుకుతుండటంతో మరోసారి రైతులు ఆగ్రహించారు. వేలంపాటలను అడ్డుకున్నారు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్మన్, కార్యదర్శి తదితరులు వెళ్లి రూ.300 నుంచి వేలంపాట నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతులపై దౌర్జన్యం... ఉల్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన రైతులపై మార్కెట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదటి అంతస్తులో ఉన్న కమిటీ కార్యాలయంలోకి వెళ్తున్న పోలకల్ గ్రామానికి చెందిన రాజు, మరికొందరు రైతులను అడ్డుకుని దౌర్జన్యం చేశారు. ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లా.. కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు, రైతుల పరిస్థితిని ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి తెలిపారు. ముఖ్యమంత్రితో సహా వ్యవసాయ పౌర సరఫరాల శాఖ మంత్రులు, జిల్లాకలెక్టర్, జేసీల దష్టికి తీసుకెళ్లి ఉల్లి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరామని వివరించారు. సర్కారు హామీ ఏమైంది.. గత ఏడాది ఇదే నెలలో క్వింటాలు ఉల్లి ధర రూ.4 వేలకు పైగా ఉంది. ధరలు పెరిగి వినియోగదారులు ఆందోళన చెందుతుండటంతో ప్రభుత్వం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు చేసి రాష్ట్రంలోని 13 జిల్లాలకు సరఫరా చేసి కిలో రూ.20 ప్రకారం పంపిణీ చేసింది. ఆ సమయంలో ఉల్లి కొనుగోళ్ల పరిశీలకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ధర పడిపోయిన సందర్భాల్లో కనీస మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సరిగ్గా ఏడాది గడిచిందో లేదో పరిస్థితి తారుమారైంది. హామీలు నీటిమూటలయ్యాయి. -
‘ఉల్లి’ కల్లోలం.. ఆపండి
♦ అధికారులూ కల్లాల్లోకి వెళ్లండి ♦ ఉల్లి రైతుకు అండగా నిలబడదాం ♦ కిలో రూ.12కు విక్రయించే ఏర్పాట్లు చేయండి ♦ మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం ♦ ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దిగుబడి పెరిగి, మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న ఉల్లిగడ్డ రైతులకు అండగా నిలబడదామంటూ భారీ నీటిపారుద ల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. క్వింటాలు ఉల్లికి కనీసం రూ.1200 గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులను ఆదేశించారు. ఉల్లి రైతు కష్టాన్ని దళారులు దోచుకుంటున్న తీరును వివరిస్తూ ‘కన్నీళ్లు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. చేతికి అందిన పంట దళారుల పాలుకాకుండ చూసే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని మంత్రి గుర్తుచేశారు. కల్లాల్లోకి వెళ్లి పంట దళారులకు అమ్ముకోకుండా చూడాలన్నారు. వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం పనులు పెద్దగా లేనందున సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని కూడా డిప్యూటేషన్‌పై నారాయణఖేడ్ నియోజకవర్గానికే పంపించాలని సూచించారు. రైతులు పంటను నేరుగా రైతు బజారుకు తరలించి, కిలోకు కనీస మద్దతు ధర రూ.12 కు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు అవసరమైతే పల్లె వెలుగు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటుచేయాలని నారాయణఖేడ్ డిపో మేనేజర్‌ను ఆదేశించారు. -
ఉల్లి రైతుల ఆందోళన
-
ఉల్లి రైతుల ఆందోళన
నిన్నటి వరకూ కస్టమర్స్ తో కన్నీరు పెట్టించిన ఉల్లి.. తాజాగా.. రైతులను ఆందోళన పరుస్తోంది. రెండు వారాల్లో అన్యూహ్యంగా ఉల్లిధర పడిపోయింది. గత నెలలో కిలో 100 రూపాయలు పలికిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.3 పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ క్వింటాల్ రూ. 1200 తాజాగా రూ.300 పడిపోయింది. దీంతో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులను సమాధాన పరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
గొల్లుమన్న ఉల్లి రైతు
దేవరకద్ర: అనుకున్నంత అరుు్యంది. ఉల్లి ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయూరుు. గతంలో కనిష్టంగా వచ్చిన ధరల కన్నా తక్కువకు దిగజారడంతో ఉల్లి రైతు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు రావడంతో అక్కడి మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయూరుు. ఈ ప్రభావం స్థానిక మార్కెట్లపై చూపడంతో ధరలు పూర్తిగా తగ్గిపోయారుు. గత వారం ధరలో సగమే.... గతవారం ఉల్లిపాయల బహిరంగ వేలం లో కనిష్టంగా క్వింటాల్‌కు రూ. 1300 పలుకగా, గరిష్టంగా రూ. 1700 వరకు వచ్చింది. అరుుతే బుధవారం జరిగిన వేలంలో కనిష్టంగా రూ. 300, గరిష్టంగా రూ 800 ధరలు పలికారుు. ధరల తీరు ను పరిశీలిస్తే గత వారంలో వచ్చిన కని ష్ట ధర కూడా నమోదుకాకపోవడం గమనార్హం. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దాదాపు వేయి బస్తాలకు పైగా సరుకు మార్కెట్‌కు రాగా రైతులు అమ్ముకోవాలో వద్దో అర్థంకాక అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వేలానికి రాని బయటి వ్యాపారులు స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు వచ్చే వ్యాపారులు ఈ వారం రాకపోవడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణంగా రైతులు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ప్రతి బుధవారం స్థానిక మార్కెట్లో జరిగే ఉల్లిపాయల వేలం పాల్గొంటారు. అరుుతే హైదరాబాద్ మార్కెట్లో ధరలు పడిపోవడంతో కొనుగోళ్లపై బయటి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. వేలం లేకుండానే ధర నిర్ణయం చిన్న సైజులో ఉండే ఉల్లి వేలానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు వారిని వేడుకోవడం కనిపించింది. దీనిని ఆసరగా తీసుకున్న వ్యాపారులు తమకు తోచిన ధరకు కొనుగోలు చేశారు.