దేవరకద్ర: అనుకున్నంత అరుు్యంది. ఉల్లి ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయూరుు. గతంలో కనిష్టంగా వచ్చిన ధరల కన్నా తక్కువకు దిగజారడంతో ఉల్లి రైతు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు రావడంతో అక్కడి మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోయూరుు. ఈ ప్రభావం స్థానిక మార్కెట్‌లపై చూపడంతో ధరలు పూర్తిగా తగ్గిపోయారుు.
గత వారం ధరలో సగమే....
గతవారం ఉల్లిపాయల బహిరంగ వేలం లో కనిష్టంగా క్వింటాల్‌కు రూ. 1300 పలుకగా, గరిష్టంగా రూ. 1700 వరకు వచ్చింది. అరుుతే బుధవారం జరిగిన వేలంలో కనిష్టంగా రూ. 300, గరిష్టంగా రూ 800 ధరలు పలికారుు. ధరల తీరు ను పరిశీలిస్తే గత వారంలో వచ్చిన కని ష్ట ధర కూడా నమోదుకాకపోవడం గమనార్హం. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దాదాపు వేయి బస్తాలకు పైగా సరుకు మార్కెట్‌కు రాగా రైతులు అమ్ముకోవాలో వద్దో అర్థంకాక అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
వేలానికి రాని బయటి వ్యాపారులు
స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు వచ్చే వ్యాపారులు ఈ వారం రాకపోవడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణంగా రైతులు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ప్రతి బుధవారం స్థానిక మార్కెట్‌లో జరిగే ఉల్లిపాయల వేలం పాల్గొంటారు. అరుుతే హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో కొనుగోళ్లపై బయటి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
వేలం లేకుండానే ధర నిర్ణయం
చిన్న సైజులో ఉండే ఉల్లి వేలానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు వారిని వేడుకోవడం కనిపించింది. దీనిని ఆసరగా తీసుకున్న వ్యాపారులు తమకు తోచిన ధరకు కొనుగోలు చేశారు.
గొల్లుమన్న ఉల్లి రైతు
Published Thu, Nov 13 2014 4:14 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement