నినాదాలు చేస్తున్న యువకులతో వాగ్వివాదం చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులు
సాక్షి, లింగాలఘణపురం: గో బ్యాక్.. గో బ్యాక్.. ఇందిరా గో బ్యాక్ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ మహాకూటమి అభ్యర్థి సింగపురం ఇందిరను కుందారంలో యువకులు అడ్డుకున్నారు. జనగామ జిల్లా ఉద్యమంలో కనిపించని ఇందిరా నేడు జఫర్‌గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలుతానంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం పట్ల మండలంలోని కుందారం గ్రామంలో ఆదివారం రాత్రి ఆమెకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా రోడ్‌షో ఆదివా రం మండలంలోని నెల్లుట్ల నుంచి ప్రారంభించారు.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుందారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్న సమయంలో స్థానిక యువకులు కొంతమంది ఇందిరా గో బ్యాక్ అంటూ నినదిం చారు. జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమాల ఫలితంగా జరిగిందని, అలాంటి జిల్లా ఉనికి కోల్పో యే విధంగా జఫర్‌గడ్ మండలాన్ని అధికారంలోనికి వస్తే వరంగల్‌లో కలుపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావంటూ ప్రశ్నించారు. దీంతో స్థానిక యువకులకు, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది. జై జనగామ..జైజై జనగామ అంటూ పెద్ద ఎత్తున యువకులు నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment