janagama constituency
-
కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. అయితే మాయమాటలతో రైతులను గోల్మాల్ చేసి రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈనె గాచి నక్కల పాలు చేసినట్లు కాంగ్రెస్ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దని హితవు పలికారు. మంగళ వారం మంత్రుల నివాస సముదాయంలో జన గామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పక డ్బందీ ప్రణాళికతో, పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్ల బాధ్యత మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయా కర్రావుకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ప్రతి ఊరూవాడ నుంచి జన సమీకరణ చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన అవ కాశంతో జనగామలో 2014లో 34 వేలు, 2018 లో 30 వేల ఓట్ల మెజారిటీతో పీసీసీ అధ్యక్షుడిని ఓడించి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యరి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 70 వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజల ముందు పెడతారని పల్లా తెలిపారు. పల్లా ప్రచారానికి లైన్ క్లియర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 16న జనగామ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే జన గామ టికెట్ దక్కని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నడుమ రాజీ కోసమే ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. కాగా ఈ భేటీ ద్వారా పల్లా అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు ప్రచారానికి కూడా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనగామ నియోజకవర్గంలో బహిరంగ కార్యక్రమాలకు పల్లా శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో ‘నర్సాపూర్’పై సయోధ్య! నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీ ఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం లేదనే అంశంపై స్పష్టత ఇచ్చారు. అయితే వారం రోజుల వ్యవధి లో నాలుగైదు పర్యాయాలు మదన్‌రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యేగా కొన్ని పెండింగ్ పనులు, ఫైళ్ల కోసమే ఆయన వెళ్తున్నారని చెబుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే అంతర్గతంగా నియో జకవర్గంలో పార్టీ నేతలను కలిసి మద్దతు కోరు తున్నారు. కాగా జనగామ తరహాలో ఒకటీ రెండురోజుల్లో సునీతా లక్ష్మారెడ్డి, మద న్‌రెడ్డి మధ్య కూడా రాజీ కుదిర్చి ఒకే వేదికపై ప్రకటన ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. జనగా మ, నర్సాపూర్, మల్కాజిగిరి, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప ల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజి గిరి), నందకిషోర్ వ్యాస్ (గోషామహల్), ఆనంద్ గౌడ్ (నాంపల్లి)కి ఈ నెల 15న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్‌కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
ఇందిరా.. గో బ్యాక్..
సాక్షి, లింగాలఘణపురం: గో బ్యాక్.. గో బ్యాక్.. ఇందిరా గో బ్యాక్ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ మహాకూటమి అభ్యర్థి సింగపురం ఇందిరను కుందారంలో యువకులు అడ్డుకున్నారు. జనగామ జిల్లా ఉద్యమంలో కనిపించని ఇందిరా నేడు జఫర్గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలుతానంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం పట్ల మండలంలోని కుందారం గ్రామంలో ఆదివారం రాత్రి ఆమెకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా రోడ్‌షో ఆదివా రం మండలంలోని నెల్లుట్ల నుంచి ప్రారంభించారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుందారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్న సమయంలో స్థానిక యువకులు కొంతమంది ఇందిరా గో బ్యాక్ అంటూ నినదిం చారు. జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమాల ఫలితంగా జరిగిందని, అలాంటి జిల్లా ఉనికి కోల్పో యే విధంగా జఫర్గడ్ మండలాన్ని అధికారంలోనికి వస్తే వరంగల్‌లో కలుపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావంటూ ప్రశ్నించారు. దీంతో స్థానిక యువకులకు, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది. జై జనగామ..జైజై జనగామ అంటూ పెద్ద ఎత్తున యువకులు నినదించారు. -
పొన్నాలకే జనగామ
సాక్షి, జనగామ: కూటమిలోని పొత్తులు..సీట్ల పంపకాల్లో భాగంగా జనగామ స్థానంపై రాజ కీయంగా వారం రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీల మధ్య కుదిరిన అవగాహనతో పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. ఏఐసీసీ శనివారం ప్రకటించిన మూడోజాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు కల్పించింది. దీంతో జనగామ సీటుపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. పొన్నాలకు టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి పొన్నాల సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ స్థానం కోసం టీజేఎస్ పట్టుపట్టింది. తమకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసింది. 12 స్థానాల్లో పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. జనగామ నుంచే కోదండరామ్ పోటీచేస్తారని ప్రకటన చేయడంతోపాటు ఏకంగా ప్రచార రథాలను సిద్ధంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కలేదు. ఢిల్లీకి వెళ్లిన పొన్నాల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం అయ్యారు. కోదండరాం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పొన్నాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి స్వయంగా కోదండరాంను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పోటీపై కోదండరాం వెనక్కితగ్గారు. దీంతో పొన్నాల పోటీకి లైన్‌క్లియర్ అయింది. శనివారం ఏఐసీసీ 13 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాతో జనగామ స్థానాన్ని పొన్నాలకు కేటాయించారు. పోటీనుంచి తప్పుకున్న కోదండరాం.. జనగామ బరి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమిలో సీ ట్ల సర్దుబాటు కారణంగా జనగామ నుంచి సీని యర్ కాంగ్రెస్ నేత పొన్నాలకు అవకాశం కల్పిం చడం కోసం ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కోదండరాం పోటీ చేయడానికి ఆసక్తి ఉ న్న మంచిర్యాల, మేడ్చల్, జనగామ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కోదండరాం పోటీ చేయనట్లు తెలుస్తోంది. నేటి నుంచి 64వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు పర్వతగిరి: ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 64వ ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సతీష్ తెలిపారు. అండర్–19 క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్, వూ– షూ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మామునూర్ ఏసీపీ ప్రతాప్‌కుమార్, ఆర్డీఎఫ్ పాఠశాలల చైర్మెన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు పాల్గొంటారని తెలిపారు. -
పొన్నాల ఇలాకాలో ‘గులాబీ’ పాగా
జనగామ, న్యూస్‌లైన్: జనగామ నియోజకవర్గంలో గులాబీ గుబాలించింది. గత సర్పంచ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సత్తా చాటింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు పరాభవాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో మొత్తం 67 ఎంపీటీసీ ఐదు జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో టీఆర్ఎస్ 35 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 20 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, బీజేపీ ఐదు, టీడీపీ రెండు, ఇండిపెండెంట్లు ఐదు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. జనగామ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండ గా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చెరో 5 స్థానాలు, ఒకటి టీడీపీ గెలుచుకుంది. ఎంపీపీ కావాలంటే మరొక ఎంపీటీసీ మద్దతు అవసరం. టీడీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రాధాన్యత నెలకొంది. బచ్చన్నపేట మండలంలో13 ఎంపీటీసీ స్థానాలకు 3 కాంగ్రెస్, టీఆర్ఎస్ 7, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నారు. నర్మెట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 2, టీడీపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఒకటి గెలుచుకున్నారు. చేర్యాల మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్ 12, బీజేపీ, కాంగ్రెస్‌లో చెరో 3, ఇండిపెండెంట్లు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. మద్దూరు మండలం కాంగ్రెస్‌కు కొంత ఊరట నిచ్చింది. ఇక్కడ 11 ఎంపీటీసీ స్థానాలుండగా 7 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ గెలుపొందారు. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్కు చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట మండలాలు భారీ మెజారిటీ కట్టబెట్టగా జనగామ మండలంలో హోరాహోరీ పోరు నెలకొంది. నాలుగు జెడ్పీటీసీ స్థానాలు... నియోజకవర్గంలో 5 మండలాలుండగా.. అందులో టీఆర్ఎస్ నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. జనగామ జెడ్పీటీసీగా టీఆర్ఎస్కు చెందిన బాల్దే విజయ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కొత్త కరుణాకర్‌రెడ్డిపై 1965 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. విజయకు 11,472 ఓట్లు పోల్‌కాగా కవితకు 9,507 ఓట్లు వచ్చాయి. చేర్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకరి రజిత తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి తాడెం రంజితపై 3,885 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. సుంకరి రజితకు 15,100 ఓట్లు, తాడెం రంజితకు 11,252 ఓట్లు పోలైనాయి. నర్మెటలో టీఆర్ఎస్ అభ్యర్థి గద్దల పద్మ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కల్యాణం లలితపై 4,279 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పద్మకు 11,942 ఓట్లు, లలితకు 7,663 ఓట్లు పోలయ్యాయి. బచ్చన్నపేట మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల స్వప్న తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గిరిబోయిన భాగ్యలక్ష్మిపై 4,142 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. స్వప్నకు 12,943 ఓట్లు, గిరబోయిన భాగ్యలక్ష్మికి 8,801 ఓట్లు పడ్డాయి. మద్దూరు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి నాచగోని పద్మ వెంకటేష్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బోయిని లక్ష్మిపై 1,660 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పద్మకు 10,138 ఓట్లు, లక్ష్మికి 8,478 ఓట్లు వచ్చాయి. నాలుగు ఎంపీపీ స్థానాలు.. ఈ ఫలితాలతో నాలుగు ఎంపీపీ స్థానాలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. నర్మెట, చేర్యాల, బచ్చన్నపేట మండలాల్లో సంపూర్ణ ఆధికత్య ఉండగా జనగామ మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చేరి సగం ఎంపీటీసీ స్థానాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ గానుగుపహాడ్‌లో టీడీపీ అభ్యర్థి కొర్ర కవితకాల్రాం గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థే ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే ఆమెతో సంప్రదించి టీఆర్ఎస్ నాయకులు తమ వైపు తిప్పుకున్నట్లు తెలిసింది. ఇటీవలే ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లో చేరిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దాసరి రవి (మరిగడి) స్థానంతోపాటు తన సతీమణి సరిత(వెంకిర్యాల) ఎంపీటీసీగా గెలుపొందింది. దీంతో దాసరి రవి ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది.