సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. అయితే మాయమాటలతో రైతులను గోల్‌మాల్ చేసి రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈనె గాచి నక్కల పాలు చేసినట్లు కాంగ్రెస్ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దని హితవు పలికారు.
మంగళ వారం మంత్రుల నివాస సముదాయంలో జన గామ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పక డ్బందీ ప్రణాళికతో, పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్ల బాధ్యత మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయా కర్‌రావుకు అప్పగించినట్లు తెలిపారు.
కాగా ప్రతి ఊరూవాడ నుంచి జన సమీకరణ చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన అవ కాశంతో జనగామలో 2014లో 34 వేలు, 2018 లో 30 వేల ఓట్ల మెజారిటీతో పీసీసీ అధ్యక్షుడిని ఓడించి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యరి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 70 వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజల ముందు పెడతారని పల్లా తెలిపారు.
పల్లా ప్రచారానికి లైన్ క్లియర్
పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 16న జనగామ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే జన గామ టికెట్ దక్కని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నడుమ రాజీ కోసమే ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. కాగా ఈ భేటీ ద్వారా పల్లా అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు ప్రచారానికి కూడా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనగామ నియోజకవర్గంలో బహిరంగ కార్యక్రమాలకు పల్లా శ్రీకారం చుట్టనున్నారు.
త్వరలో ‘నర్సాపూర్’పై సయోధ్య!
నర్సాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీ ఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం లేదనే అంశంపై స్పష్టత ఇచ్చారు. అయితే వారం రోజుల వ్యవధి లో నాలుగైదు పర్యాయాలు మదన్‌రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యేగా కొన్ని పెండింగ్ పనులు, ఫైళ్ల కోసమే ఆయన వెళ్తున్నారని చెబుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే అంతర్గతంగా నియో జకవర్గంలో పార్టీ నేతలను కలిసి మద్దతు కోరు తున్నారు.
కాగా జనగామ తరహాలో ఒకటీ రెండురోజుల్లో సునీతా లక్ష్మారెడ్డి, మద న్‌రెడ్డి మధ్య కూడా రాజీ కుదిర్చి ఒకే వేదికపై ప్రకటన ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. జనగా మ, నర్సాపూర్, మల్కాజిగిరి, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్‌ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప ల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజి గిరి), నందకిషోర్ వ్యాస్ (గోషామహల్), ఆనంద్ గౌడ్ (నాంపల్లి)కి ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment