
సాక్షి, జనగామ: కూటమిలోని పొత్తులు..సీట్ల పంపకాల్లో భాగంగా జనగామ స్థానంపై రాజ కీయంగా వారం రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీల మధ్య కుదిరిన అవగాహనతో పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. ఏఐసీసీ శనివారం ప్రకటించిన మూడోజాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు కల్పించింది. దీంతో జనగామ సీటుపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. పొన్నాలకు టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి పొన్నాల సిద్ధమవుతున్నారు.
ఎట్టకేలకు..
మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ స్థానం కోసం టీజేఎస్ పట్టుపట్టింది. తమకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసింది. 12 స్థానాల్లో పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. జనగామ నుంచే కోదండరామ్ పోటీచేస్తారని ప్రకటన చేయడంతోపాటు ఏకంగా ప్రచార రథాలను సిద్ధంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కలేదు. ఢిల్లీకి వెళ్లిన పొన్నాల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం అయ్యారు. కోదండరాం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పొన్నాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి స్వయంగా కోదండరాంను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పోటీపై కోదండరాం వెనక్కితగ్గారు. దీంతో పొన్నాల పోటీకి లైన్‌క్లియర్ అయింది. శనివారం ఏఐసీసీ 13 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాతో జనగామ స్థానాన్ని పొన్నాలకు కేటాయించారు.
పోటీనుంచి తప్పుకున్న కోదండరాం..
జనగామ బరి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమిలో సీ ట్ల సర్దుబాటు కారణంగా జనగామ నుంచి సీని యర్ కాంగ్రెస్ నేత పొన్నాలకు అవకాశం కల్పిం చడం కోసం ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కోదండరాం పోటీ చేయడానికి ఆసక్తి ఉ న్న మంచిర్యాల, మేడ్చల్, జనగామ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కోదండరాం పోటీ చేయనట్లు తెలుస్తోంది.
నేటి నుంచి 64వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలు
పర్వతగిరి: ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 64వ ఎస్‌జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సతీష్ తెలిపారు. అండర్–19 క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్, వూ– షూ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మామునూర్ ఏసీపీ ప్రతాప్‌కుమార్, ఆర్డీఎఫ్ పాఠశాలల చైర్మెన్ ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment