సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ రెండో జాబితాలోనూ తన పేరును ప్రకటించకపోవడం పట్ల మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుల వల్లే సీటు ప్రకటన ఆసల్యం అవుతుందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు తేలినా, తేలకపోయినా తాను మాత్రం జనగామ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. టీజేఎస్ పార్టీ జనగామ టికెట్‌ను ఎందుకు కోరుతుందో అర్ధం కావడం లేదన్నారు. కోదండరాం పోటీ చేయడానికి జనగామ ఒక్కటే ఉందా అని ప్రశ్నించారు. టీజేఎస్‌కు రాష్ట్రంలో 119 సీట్లు ఖాళీగా ఉండగా తాను పోటీ చేసే నియోజకవర్గం ఒక్కటే కావాల్సి వచ్చిందా అని విమర్శించారు. పొత్తులు త్వరగా తేలిస్తే కాంగ్రెస్ పార్టీకే శ్రేయస్కరం అని పొన్నాల అభిప్రాయ పడ్డారు.
కాగా మంగళవారం టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. జనగామ నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకుంటున్నాని కోదండరాం తెలిపారు. అయినప్పటికీ బుధవారం కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment