
సభలో మాట్లాడుతున్న సీతక్క
సాక్షి, ములుగు: వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వచ్చేవిధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు అభ్యర్థి సీతక్క పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నియంత పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చిన జనం
ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ సభకు ప్రజలు తండోపతండాలుగా తలివచ్చారు. తొమ్మిది మండలాల నుంచి సుమారు 40 వేల మంది సభకు హాజరయ్యారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి జంపాల రవీందర్, టీజేఎస్ ఇన్‌చార్జి రాజు నాయక్, టీడీపీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య జవహర్‌లాల్, అనంతరెడ్డి, మంకిడి నర్సయ్య, మాజీ ఎంపీపీలు నల్లెల్ల కుమారస్వామి, మస్రగాని వినయ్‌కుమార్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, ఎండీ అహ్మద్‌పాషా, జయపాల్‌రెడ్డి, చంద్రమౌళి, మహేశ్, పాల్గొన్నారు.

బహిరంగ సభకు హాజరైన ప్రజలు