ప్రజలను మోసగించిన టీఆర్‌ఎస్‌ | Congress Candidate Election Campaign,Warangal | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసగించిన టీఆర్‌ఎస్‌

Nov 27 2018 9:29 AM | Updated on Aug 27 2019 4:45 PM

Congress Candidate Election Campaign,Warangal - Sakshi

కోలాటమాడుతున్న నర్సంపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి

సాక్షి, చెన్నారావుపేట: తెలంగాణ ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి అన్నా రు. ఈ మేరకు మండలంలోని పాత మగ్దుంపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికా రు. యువకులు కేరింతలు కొడు తూ డప్పు చప్పు ళ్లు, కోలాటాలతో ఆటలు ఆడుతూ స్వాగతం పలికారు. ప్రచారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు  వేసి  గెలిపించకుంటే ఇంట్లో పండుకుంటా అన్న కేసీ ఆర్‌కు ఓటు వేస్తే మురి గిపోతుందన్నారు.

కమీషన్లతో అడ్డదారిలో డబ్బులు సంపాదించిన  పెద్దిని ఓడించాలన్నారు. పాతమగ్దుంపురం గ్రామాన్ని పంచాయతీ ఎన్నికలలోపే చెన్నారావుపేటలో కలుపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, ఎంపీపీ జక్క అశోక్, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, ననుమాస మల్లయ్య, ననుమాస కర్ణాకర్, పోలెపల్లి బిక్షపతి, ననుమాస రాములు, ఆకు ల కవిత, జమున,అలువాల శ్రీనివాస్, సో మన్న, శివ, సంపత్,  రంజిత్, సదానం దం, దేవ, రమేష్, బషీర్, జాన్, స్వామి, సరోజన, మహేందర్‌రెడ్డి, గట్ల రాంబా బు, తోట రాము, బొంత శ్రీను, చేరాలు, రాంబాబు, రంజిత్, శోభన్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement