థ్రిల్లర్ సినిమాగా ఇందిరాగాంధీ ప్రసంగం..
న్యూఢిల్లీః అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగం.. సినిమాగా రూపొందుతోంది. 40 ఏళ్ళ క్రితం 1975 జూన్ 25న భారత్ లో ఎమర్జెన్సీని విధించి... ఆరోజు రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఆమె ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం ప్రముఖ బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'సన్ పఛత్తర్' గా విడుదల కాబోతోంది.
ఎమర్జెన్సీ పై నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగం ఓ కథా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షయ్' ఫేమ్ సందీప్ మాధవన్ భయంకరమైన (పానిక్) సౌండ్ ట్రాక్ ను అందించారు. ఆల్ ఇండియా రేడియోలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగంపై రూపొందుతున్న ఈ కథా చిత్రానికి సంబంధించిన అన్ని ఆడియో హక్కులను ఆల్ ఇండియా రేడియోనుంచి, వీడియో హక్కులను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాత కబీర్ లోవీ ఓ ప్రకటనలో తెలిపారు.
'సన్ పఛత్తర్' సినిమాలో స్టార్ నటుడు కె కె మెనన్, ప్రవేశ్ రాణా, కీర్తి కుల్హారీలు నటిస్తుండగా, 'తమాన్ ఛే' ఫేమ్ నవనీత్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.