దేశ రాజధాని ఢిల్లీ లేదా ఇటువంటి మెట్రో నగరాల్లో ఏదో విషయమై అప్పుడప్పుడు అల్లర్లు చోటుచేసుకుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య జిల్లా హింసాత్మకంగా మారింది. పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ఐదు అతిపెద్ద అల్లర్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం.
1. సిక్కు అల్లర్లు(1984)
దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఇవి చోటుచేసుకున్నాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది ఆమె అంగరక్షకులే. వారు సిక్కు మతానికి చెందినవారు. అందుకే ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని ప్రజలు సిక్కులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోతకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఐదు వేల మంది మరణించారని చెబుతుంటారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా చనిపోయారు.
ఇందిరా గాంధీ హత్యకు కారణం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అని చెబుతుంటారు. నాడు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె భారత సైన్యాన్ని ఆదేశించారు. ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. ఆలయంలోకి ప్రవేశించిన జర్నైల్ సింగ్, భింద్రన్‌వాలే అతని సహచరులు ఆలయం లోపల ఉన్న సైనికులపై దాడి చేశారు. దీంతో ఇందిర ప్రభుత్వం తుపాకులతో దాడి చేయాలని సైనికులను ఆదేశించింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, అతని సహచరులు మరణించారు.
2. భాగల్పూర్ అల్లర్లు(1989)
1947లో చోటుచేసుకున్న భాగల్పూర్ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అల్లర్ల జాబితాలో ఉంటాయి. ఈ అల్లర్లు 1989 అక్టోబర్‌లో భాగల్‌పూర్‌లో జరిగాయి. హిందూ- ముస్లిం వర్గాల మధ్య ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
3. ముంబై అల్లర్లు (1992)
ఈ అల్లర్లకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత. ఈ హింస డిసెంబర్ 1992లో ప్రారంభమై జనవరి 1993 వరకు కొనసాగింది. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 900 మంది చనిపోయారు. వీరిలో 575 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తుతెలియని వారు, మరో ఐదుగురు ఉన్నారు. సుధాకర్ నాయక్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యిందని నిరూపితమయ్యింది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవవలసి వచ్చింది.
4. గుజరాత్ అల్లర్లు(2002)
గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అల్లర్లు. గోద్రా ఘటన 2002లో జరిగింది. 27 ఫిబ్రవరి 2002న రైల్వే స్టేషన్‌లో ఒక గుంపు సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్‌కు నిప్పు పెట్టడంతో 59 మంది కరసేవకులు మరణించారు. ఫలితంగా గుజరాత్ అంతటా మతకల్లోలాలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారు. ఆ సమయంలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు.
5. ముజఫర్‌నగర్ (2013)
ఈ అల్లర్లు ముజఫర్‌నగర్ జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగాయి. దీని కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఆగస్టు 27న కవాల్ గ్రామంలో జాట్ సామాజికవర్గ బాలికపై ముస్లిం యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు గురైన బాలిక బంధువు.. ఆ ముస్లిం యువకుడిని హత్య చేశాడు. తరువాత దీనికి ప్రతిగా పలువురు ముస్లింలు.. ఆ బాలిక సోదరులను హత్యచేశారు.
ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment