యువతరానికి నచ్చే సినిమా | youth full entertainer movie | Sakshi
Sakshi News home page

యువతరానికి నచ్చే సినిమా

Published Sat, Oct 26 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

యువతరానికి నచ్చే సినిమా

యువతరానికి నచ్చే సినిమా

 శ్రీబాలాజీ, నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకులుగా రూపొందుతోన్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. నవంబర్ తొలివారంలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 
  మణిశర్మ గీతాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.ఆర్.రాజు చెప్పారు. సోని చరిష్టా, రిషిక, సిరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు, గౌతంరాజు, చిత్రం శ్రీను, జూ.రేలంగి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి.ఆర్.కె.రాజు, కూర్పు: నందమూరి హరి, సహ నిర్మాత: ఎం.మలర్‌కొడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement