
గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనాతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకం విడిచి వెళుతుండటం కలవరపెడుతోంది. వారి కుటుంబ సభ్యులను కూడా ఈ మహహ్మారి వదలడం లేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మృతి చెందారు. తాజాగా కమిడియన్ గౌతంరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సిద్దార్థ కరోనాతో మృతి చెందాడు.
ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. సిద్దార్దకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన సోదరుడి మృతి విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేసిన గౌతం రాజు.. బయట పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయని, అంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment