
వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం
బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడుకు బుధవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని ఇండోర్లో అత్యవసరంగా లాండ్ చేశారు.
ఇండోర్: బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడుకు బుధవారం పెద్ద ప్రమాదం తప్పింది. వెంకయ్య నాయుడు మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కాగా ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని ఇండోర్లో అత్యవసరంగా లాండ్ చేశారు. ప్రమాదం తప్పి క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండోర్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.