విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. మరో బస్సు ఏర్పాటు చేస్తామని బస్సు యాజమాన్యం సదరు ప్రయాణికులకు తెలిపింది. దీంతో ఆ బస్సులోని దాదాపు 45 మంది ప్రయాణికులు రాత్రంతా బస్సులోన పడిగాపులు పడ్డారు.
మరో బస్సు రాకపోవడంతో ప్రయాణికులు పోలీసులను ఆశ్రయించారు. వేరొక బస్సు ఏర్పాటు చేస్తామని యాజమాన్యం మోసం చేసిందని పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని... ప్రయాణికులను హైదరాబాద్ పంపించారు.