'ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి ఓట్లు'
ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి ఓటు పడుతున్నాయి... దాంతో ఓటు వేసి బయటకు వచ్చిన ఓటర్లు బిత్తరపోయారు. స్థానిక ఎన్నికల అధికారులకు ఓటర్లు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల అధికారులకు సదరు ఈవీఎంను పరీక్షించారు. ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగానే అలా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఆ ఈవీఎంను తొలగించి... ఆ స్థానంలో కొత్త ఈవీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలోని మనూర్ మండలం దాన్వార్లో బుధవారం ఆ సంఘటన చోటు చేసుకుంది.