► మిగిలింది మట్టే
► మురుగంపట్టిలో కన్నీటి ఘోష
► 19కి చేరిన మృతుల సంఖ్య
► రంగంలోకి సీబీసీఐడీ
► వెలుగులోకి యాజమాన్య నిర్లక్ష్యం
► సాంకేతిక సమస్యతోనే పెను ప్రమాదం
సాక్షి, చెన్నై : ‘గుర్తు పట్టేందుకు వీలులేనంతంగా ఛిద్రమైన శరీరాలు.. మట్టిలో కలిసిన అవయవాలు.. ప్రతి గుండె బరువెక్కేంతగా హృదయ విదారకర పరిస్థితులు’. ఇది మురుగంపట్టిలో దర్శనం ఇస్తు న్న దృశ్యాలు. తమ వాళ్ల కడచూపు కూడా దక్కని దృష్ట్యా, బాధిత కుటుంబాల కన్నీటి వేదనకు హద్దే లేదు. చివరకు తమకు మిగిలింది మట్టే అన్నట్టుగా అక్కడి మట్టిని కొంత తవ్వి, అదే తమ వారి భౌతిక కాయం అంటూ అంత్యక్రియలకు తీసుకెళ్తుండడం బట్టి చూస్తే, పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
తిరుచ్చి జిల్లా తురైయూర్ సమీపంలోని మురుగంపట్టిలోని వెట్రివేల్ రసాయన కర్మాగారంలో గురువారం భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు 18 మంది అని అధికార వర్గాలు తేల్చాయి. తొలి రోజు సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో రెండో రోజైన శుక్రవారం కూడా రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగానే సాగింది. నాలుగు ప్రొక్లైనర్లను తీసుకొచ్చి మరీ మృతదేహాల కోసం గాలించాల్సిన పరిస్థితి. కర్మాగారంలో పనిచేస్తున్న తమ అబ్బాయి ప్రవీణ్ కన్పించడం లే దంటూ సేలం నుంచి కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో మృతుల సంఖ్య 19కు చేరినట్టు అరుుంది. అరుుతే, మిగిలిన పదిహేను మృతదేహాల్ని గుర్తిం చేం దుకు వీలు కూడా లేదని అధికార వర్గాలు తేల్చాయి.
ఎక్కడికక్కడ శరీర అవయవాలు ఛిద్రమై మట్టిలో కలవడం, పేలుడు దాటికి భవనం కుప్పకూలడమే కాకుండా, అక్కడి రసాయనాలు, యాసిడ్ కారణంగా చెలరేగిన మంటల కారణంగా ఆచూకీ తేల్చడం కష్టతరంగా మారింది. దీంతో అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబాల కన్నీటి రోదనకు హద్దే లేదు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. తమ వాళ్ల కడచూపు కూడా దక్కకుండా చేశారంటూ తిట్టి పోస్తూ, రోదించే వాళ్లు కొందరు అరుుతే, జరిగింది జరిగి పోరుుందంటూ ఆవేదన వ్యక్తం చేసే వాళ్లు మరి కొందరు. చివరకు తమకు మిగిలింది మట్టే అంటూ పలు కుటుంబాలు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి కొంత మేరకు మట్టిని తవ్వి అవే తమ వారి మృతదేహాలుగా భావించి, అంత్యక్రియలు జరుపుకునేందుకు బరువెక్కిన హృదయాలతో ముందుకు సాగారు.రంగంలోకి సీబీసీఐడీ: పేలుడు ఘటన ఎలా జరి గిందో అంతు చిక్కని దృష్ట్యా, కేసును సీబీసీఐడీకి అ ప్పగించారు. ఆ విభాగం వర్గాలు శుక్రవారం పేలుడు జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
ఆ గ్రామాల ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. అరుుతే, ఫ్యాక్టరీకి శాశ్వత తాళం వేయాల్సిందేనంటూ గ్రామస్తులు డిమాండ్ చేయడంతో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాగా, సాంకేతిక కారణాలను సరి చేయడంలో యాజమాన్యం విఫలం అవుతుండడం వల్లే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చినట్టుగా విచారణలో తేలింది. 22 ఏళ్ల క్రితం యాభై ఎకరాల విస్తీర్ణంలో వెట్రివేల్ రసాయన కర్మాగారం ఏర్పాటు చేసినట్టు తేలింది. ఇక్కడి ఏడు యూనిట్లలోని ఒక్కో యూనిట్‌లో ఒక్కో రకం పేలుడుకు ఉపయోగించే ముడిసరుకు తయారు అవుతున్నట్టు వెలుగుచూ సింది. పేలుడు జరిగిన యూనిట్‌లో భారీ విస్పోటనాలకు ఉపయోగించే పీఈటీ నైట్రేట్ అనే ముడిసరుకు తయారు అవుతున్నట్టు, రాత్రి షిఫ్ట్‌లో ఉన్న వాళ్లు టెంపరేచర్ లీక్‌ను గుర్తించి సంబంధిత విభాగానికి సమాచారం ఇచ్చినట్టే తేలింది. అరుుతే, దానిని సరిచేయలేదు. ఉదయం షిఫ్ట్‌లో పనికి వచ్చిన వాళ్లకు ఆ లీక్ విషయం తెలియనట్టు సమాచారం.
దీంతో టెంపరేచర్‌ను పెంచే క్రమంలోనే ఈ విస్ఫోటనం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి యూనిట్లు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల క్రితం నెలకొల్పినట్టు, వా టిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా, వా టిని పూర్తి స్థారుులో కాకుండా , తాత్కాలికంగా సరిచేయడం వల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిం దని గాయపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పదే పదే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, పర్యవేక్షణ లోపం కారణంగా, ప్రస్తుతం సహచరులను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడచూపు కరువు!
Published Sat, Dec 3 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
Advertisement
Advertisement