గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
గన్నవరం: గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. లోపాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని గన్నవరంలోనే నిలిపివేశాడు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటివరకు బయల్దేరలేదు. రాత్రి 9 గంటలకు బయల్దేరే అవకాశం ఉందని విమానాశ్రయం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి మూడు గంటలుగా 60 ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.