జ్యోతినగర్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఉన్న ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ యూనిట్‌లో ఆదివారం 200ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విషయం తెలిసిన అధికారులు మరమ్మత్తులు ప్రారంభించారు. కాగా మొత్తం 2600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం 2400 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని అధికారులు తెలిపారు.