
విరిగిన పట్టా.. తప్పిన ప్రమాదం
రఘనాథపల్లి(వరంగల్ జిల్లా): బల్లార్షా-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. రఘనాథపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. పట్టా విరిగిన విషయాన్ని రైల్వే అధికారులకు గ్యాంగ్‌మెన్లు సమాచారం అందించారు. దీంతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రఘనాథపల్లికి సమీపంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. గ్యాంగ్‌మెన్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మత్తు అనంతరం రైలు బయలు దేరింది.