మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రయాణీకులను రహదారిపై దింపివేశాడు. తమను మరో బస్సులో హైదరాబాద్ చేర్చాలని ప్రయాణీకులు... యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన వారి నుంచి స్పందన కరువైంది.
దాంతో ప్రయాణీకులకు ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత ఆర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ బస్సు ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వస్తుంది.