
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. శబరిమల నుంచి నల్గొండకు అయ్యప్ప భక్తుల బృందంతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నెల్లూరు - పూతలపట్టు రహదారిపై కాశిపెంట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన బస్సు డ్రైవర్ రమేష్, మరో ప్రయాణికుడు మృతి చెందగా.. మరో 30 మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేక లారీలో ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంత్రి మేకపాటి దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment