సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది. బాదంపూడి వై జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆటోను తప్పించబోయి.. పంటబోదిలోకి దూసుకుపోయింది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. అందులో 42 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మితి మీరిన వేగం కారణంగానే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే వీరందరిని హుటాహుటిన వేరే బస్సులో తరలించారు. బస్సులో ఉన్న వారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment