సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు, సబ్‌ఇన్ స్పెక్టర్లకు జీతాలు అందలేదన్న అంశంపై పీఅండ్‌ఎల్, బడ్జెట్ అధికారులతో డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం చర్చించారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నూతన పోస్టులకు జీతాల చెల్లింపు జీవో జారీ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మరోసారి చర్చించాలని పీఅండ్‌ఎల్ అధికారులను ఆదేశించారు.
పోస్టులకు సంబంధించి జీతభత్యాల చెల్లింపులో పీఏఓ (పే అండ్ అకౌంట్స్) ఆదేశాలు వెళ్లేలా మరోసారి ప్రతిపాదనలు పంపాలని, రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడేలా కృషి చేయాలని పీఅండ్ ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్ ను డీజీపీ ఆదేశించారు. కాగా.. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల విభజనలో సమయంలోనూ ఇదే సమస్య తలెత్తిందని, 6 నెలల పాటు జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని డీజీపీకి పీఅండ్‌ఎల్ అధికారులు వివరించారు.