బోగీలను వదిలేసిన 'జన్మభూమి'
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన జన్మభూమి ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆ ఎక్స్ప్రెస్ రైలు దువ్వాడ సమీపంలో రాగానే బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగింది. ఆ విషయాన్ని వెంటనే గమనించి ఇంజిన్ డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు.
ఇంజిన్ను వెంటనే బోగీల వద్దకు మరలించి.... రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఇంజిన్ బోగీల మధ్య ఉన్న లింక్లను రైల్వే సిబ్బంది సరి చేశారు. దాంతో కొద్ది ఆలస్యంగా జన్మభూమి రైలు ముందుకు కదిలింది. రైలు బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.