సాక్షి, విశాఖపట్నం: దువ్వాడ పొలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల దందా గుట్టురట్టయ్యింది. వివరాల్లోకెళ్తే.. కూర్మన్నపాలేం ప్రాంతంలో పాన్ షాపులలో ఆకస్మిక తనిఖీలుచేసి, తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ హడావిడి చేసారు. షాపులో నిషేదిత గుట్కాలను పట్టుకుని కేసు నమోదు చేస్తాం. మీకు అపరాద రుసుంతో పాటు ఆరునెలలు జైలు శిక్ష కూడా పడుతుందని భయపెట్టారు. దీంతో వ్యాపారస్ధులు భయబ్రాంతులకు గురయ్యారు. నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు, అసిస్టెంట్, కారు డ్త్రెవర్, వాళ్ళు వచ్చిన కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉండడంతో వ్యాపారస్తులు భయపడ్డారు. (మహిళ కానిస్టేబుల్ మృతి, పలు అనుమానాలు)
వరుసగా షాపులు తనిఖీలు చెయ్యడం.. కేసులు పెడతామని భయపెట్టి అందినంత దోచేయడంతో వ్యాపారస్తులకు అనుమానం వచ్చి వారిని నిలదీయడంతో ఆసలు విషయం భయటపడింది. దీంతో అక్కడ నుంచి పారిపోవాలని చూడగా అందరూ చుట్టు ముట్టి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దువ్వాడ పోలీసుల విచారణలో సదరు వ్యక్తులు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టరుగా వజ్జల శ్రీనివాసురావు, అతని అసిస్టెంట్‌గా సురేష్ లాల్, కారు డ్ర్తెవర్‌ను జీవన్ కుమార్‌లగా గుర్తించారు. నిందితులు గతంలో నగరంలోని పలు ప్రాంతాలలో వసూళ్ళకు పాల్పడ్డారు. అదే విధంగా విజయవాడ, రాజమండ్రి, భవానిపురం తదితర ప్రాంతాలలో వ్యాపారస్తులను బెదిరించి దందాలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment