రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని చెన్నాయపల్లి తండాలో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రంగారెడ్డి(గండేడ్): రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని చెన్నాయపల్లి తండాలో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో తండాలోని గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.
విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఇళ్లకు విద్యుత్ సరఫరా కాకపోవడమే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.