ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం | firing in rtc Bus in krishna district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం

Published Tue, Jan 31 2017 12:20 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

firing in rtc Bus in krishna district

విజయవాడ : కృష్ణాజిల్లాలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కంచికచర‍్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపంతో ఇంజిన్‌ వద‍్ద మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దాగారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ ఇంజిన్‌ను క్షుణ‍్ణంగా పరిశీలించాక బస్సు తిరిగి బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement