విజయనగరం (కొత్తవలస) : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఏఎంపురం గ్రామంలోని పరిసర పొలాల్లో సోమవారం ఓ హెలికాప్టర్ దిగింది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా దించినట్లు పైలట్ తెలిపారు. హెలికాప్టర్‌లో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
కాగా ప్రమాదమేమీ లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే మొట్టమొదటిసారి తమ ఊర్లోకి హెలికాప్టర్ రావడంతో గ్రామస్తులు హెలికాప్టర్‌ను చూడటానికి ఎగబడ్డారు. అధికారులు అనుమతించకపోవడంతో హెలికాప్టర్లో వచ్చిన ప్రముఖులు ఎవరో తెలియలేదు.
పొలాల్లో దిగిన హెలికాప్టర్
Published Mon, Jun 29 2015 3:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement
Advertisement