600 మెగావాట్ల విద్యుత్
ప్లాంట్‌లో తరచూ అంతరాయం
44 రోజుల పాటు సాంకేతిక సమస్యలే
జెన్‌కోకు కోట్ల రూపాయల నష్టం..
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సాంకేతిక సమస్యలతోనే కాలం వెళ్లదీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించి 48 రోజులు కాగా, అం దులో విద్యుత్ ఉత్పత్తి అరుుంది కేవలం నాలుగు రోజులే. మిగితా 44 రోజులు మరమ్మతులతోనే గడిచిపోయింది. నూతన ప్లాంట్‌లో లైటాఫ్ చేయడం, అనంతరం సింక్రనైజేషన్ చేయడం.. 200 నుంచి 300 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరగడం.. సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోవడం.. ఇదేతంతు కొనసాగుతోంది. ఈ ప్లాంట్‌లో నవంబర్ నుంచే సింక్రనైజేషన్ ప్రారంభమైనప్పటికీ డిసెంబర్ చివరి వరకు సీఓడీ చేయలేదు. ఇందుకోసం కేటీపీపీ అధికారులు చేసిన యత్నాలు ఫలించలేదు. సీఓడీ కాకముందే జనవరి 5న సీఎం కేసీఆర్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. నాటి నుంచి కేటీపీపీ, జెన్‌కో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యుదుత్పత్తి సజావుగా సాగకపోవడంతో వారు తల పట్టుకుంటున్నారు. ఓసారి స్టీమ్ పైపుల్లో.. మరోసారి బారింగ్ గేర్.. ఇంకోసారి బూడిద సమస్య, పైపులు వంగిపోవడం.. ఇలా 600 మెగావాట్ల ప్లాంట్‌కు అనేక అవాం తరాలు ఎదురవుతున్నారుు. ప్లాంట్‌లో 72 గంటల పాటు ఎలాంటి అటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరిగితేనే సీఓడీకి అవకాశం ఉంటుంది. ఇందుకోసం అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. ఆటంకం కలిగిన ప్రతిసారి నిరాశ పడకుండా నూతన ఉత్సాహంతో మళ్లీ లైటాఫ్ చేస్తున్నారు. జెన్‌కో డెరైక్టర్ కేటీపీపీలోనే ఉండి మరమ్మతు చేయిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.
కేటీపీపీకి నష్టం కోట్లలోనే...
600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల మూలంగా కేటీపీపీ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాంట్ ని ర్మాణంలో తీవ్ర జాప్యం కావడంతో ప్రాజెక్టుకు అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేశారు. 36 నెలల్లో పూర్తికావాల్సిన ప్లాంట్‌కు మరో 86 నెలల సమయం తీసుకున్నారు. సమయం, డబ్బు అదనంగా ఖర్చు చేసినా సక్రమంగా నిర్మించలేదని ప్లాంట్‌లో తలెత్తుతున్న సమస్యలు స్పష్టం చేస్తున్నారుు. 600 మెగావా ట్ల ప్లాంట్‌లో 24 గంటలకు 14.4 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. ఒక్క యూనిట్‌కు నాలుగు రూపాయల చొప్పున జెన్‌కోకు కోట్ల రూపాయలు రావాలి. కానీ సమస్యల కారణంగా ఈ ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది.
ఉత్పత్తి నాలుగు రోజులే
Published Mon, Feb 22 2016 1:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement