దరఖాస్తుకు సాంకేతిక తిరకాసు | technical problem in Job application process | Sakshi
Sakshi News home page

దరఖాస్తుకు సాంకేతిక తిరకాసు

Published Thu, Apr 27 2017 2:24 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

దరఖాస్తుకు సాంకేతిక తిరకాసు

దరఖాస్తుకు సాంకేతిక తిరకాసు

► గురుకుల దరఖాస్తు ప్రక్రియలో వెబ్‌పేజీ ఆటంకాలు
► ఆందోళన చెందుతున్న అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు పూరించే క్రమం నుంచి ఫీజు చెల్లించే వరకు పలు సమస్యలు తలెత్తడం చికాకు తెప్పిస్తోంది. సాధారణంగా ఒక్క దరఖాస్తు పూర్తి చేయడానికి పది నిమిషాలు పడుతుండగా సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి సమయం వృథా అవుతోంది. గురుకుల పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 7,306 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో టీజీటీ 4,362 పోస్టులు కాగా 921 పీజీటీ, 6 ఫిజికల్‌ డైరెక్టర్, 616 పీఈటీ, 372 ఆర్ట్‌ టీచర్, 43 క్రాఫ్ట్‌ టీచర్, 197 మ్యూజిక్‌ టీచర్, 533 స్టాఫ్‌ నర్స్, 256 లైబ్రెరియన్‌ పోస్టులున్నాయి.

వీటికి సంబంధించి ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.కానీ, దరఖాస్తు ప్రక్రియలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అభ్యర్థులు హైరానా పడుతున్నారు. దరఖాస్తు చేసే క్రమంలో ముందుగా టీఎస్‌పీఎస్సీలో రిజిస్ట్రేషన్‌(ఒన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌) వివరాలను నమోదు చేయాలి. వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత దరఖాస్తు ఫారం తెరుచుకుంటుంది. అందులో వివరాలు నమోదు చేసిన తర్వాత చివరగా సరిచూసుకోవడానికి ప్రివ్యూ ఆప్షన్‌ నొక్కిన వెంటనే వెబ్‌పేజీ స్తంభించిపోతోంది.

దీంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి హోం పేజీ తెరిచి మొదట్నుంచి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. అదేవిధంగా వివరాలు నమోదు చేసే క్రమంలోనూ అకస్మాత్తుగా పేజీ ఒకేచోట నిలిచిపోవడంతో మళ్లీ మొదటికోస్తోంది. అదేవిధంగా ఫీజును ఆన్‌లైన్‌ పద్ధతిలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌ కార్డు సహాయంతో చెల్లించినప్పటికీ దరఖాస్తులో వివరాలు అప్‌లోడ్‌ కావడం లేదు. దీంతో అభ్యర్థి ఖాతాలో నిధులు వినియోగించినట్లు చూపుతుండగా దరఖాస్తు పేజీలో మాత్రం ఫీజు చెల్లించాలని సూచన వస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

‘మీ సేవ’లోనూ అంతే!
గురుకుల ఉద్యోగ దరఖాస్తుకు పలువురు అభ్యర్థులు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తు పూరించిన తర్వాత మీసేవా నిర్వహకుల ఖాతా నుంచి ఫీజును చెలిస్తున్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఫీజు చెల్లించే క్రమంలో ఖాతా నుంచి నగదు కోతకు గురైనప్పటికీ దరఖాస్తు ఫారంలో అప్‌లోడ్‌ కావడంలేదు. దీంతో నిర్వాహకులు డబుల్‌చార్జి వసూలు చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో నగదు కోత పడినప్పటికీ వివరాలు అప్‌లోడ్‌ కాకుంటే ఆమేరకు నిధులు తిరిగి ఖాతాదారుడి అకౌంట్‌లో జమవుతాయి. అయితే అందుకు కనిష్టంగా వారంరోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement