గోదావరి మధ్యలో నిలిచిన బోటు | technical problem in boat in papikondalu | Sakshi

గోదావరి మధ్యలో నిలిచిన బోటు

Published Thu, Dec 29 2016 12:44 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు గోదావరి మధ్యలోనే నిలిచి పోయింది.

దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు గోదావరి మధ్యలోనే నిలిచి పోయింది. వివరాలివీ.. గురువారం ఉదయం సుమారు 150 మంది యాత్రికులు సాయిగాయత్రి బోట్‌లో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వైపు బయలు దేరారు. బోట్ స్టీరింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరవరం లంక వద్ద నది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో నిర్వాహకులు అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులను మరో బోట్ ద్వారా గమ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, ఈ హఠాత్ పరిణామంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement