
పాపికొండలు వెళ్లే బోటులో సాంకేతిక లోపం
దేవీపట్నం (తూర్పు గోదావరి)- పాపికొండలు టూరిజం లాంచీ గోదావరి నదిలో సాంకేతిక లోపంతో 20 నిముషాలు ఆగిపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 6 గంటలకు దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగింది.
గేర్ బాక్స్ పనిచేయకపోవడంతో టూరిజం లాంచీ 20 నిముషాలపాటు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. లాంచీ సిబ్బంది వెంటనే గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్యను సరిదిద్ది 20 నిముషాల తర్వాత లాంచీని ప్రారంభించారు.