ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో పైలట్‌కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్‌పోర్ట్ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..
ఇటీవల తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో టేకాఫ్ అయిన విమానం వీల్స్ లోపలికి ముడుచుకోలేదు. హైడ్రాలిక్స్ సమస్య కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. వెంటనే పైలట్ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసి చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment