ఢిల్లీ: ఎయిరిండియాకు చెందిన విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత కాలమానం ప్రకారం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్‌ఇండియా సిబ్బంది ఉన్నారు.
ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించామని, రష్యా మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అది సురక్షితంగానే ల్యాండ్ అయినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రయాణికులు ఎలాంటి అంతరాయం లేకుండా తమ తమ గమ్యస్థానాలు చేర్చేందుకు వీలైనంత త్వరగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
Air India flight AI173 operating from Delhi to San Francisco developed a technical issue with one of its engines. The flight with 216 passengers and 16 crew was diverted and landed safely at Magadan airport in Russia. The passengers are being provided with all support on ground… https://t.co/Sq6RmNzbea
— ANI (@ANI) June 6, 2023
Comments
Please login to add a commentAdd a comment